ప్రపంచంలోనే ధనిక కుటుంబం.. ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు!

World Richest Family Owns 4000 Crore Palace 700 Cars 8 Jets - Sakshi

రాజ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు, తరిగినపోని ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయి. కోటానుకోట్ల రూపాయాలు కూడా వాళ్ల సొంతం! అయితే ప్రపంచంలో కోట్ల ఆస్తులు ఉ‍న్న రాజ కుటుంబాలు ఉన్నప్పటీకి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ రాజ కుటుంబం చాలా ప్రత్యేకమైంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడిస్తారు! ఇటువంటి రాజ కుటుంబాల ఆస్తులు, సౌకర్యాలు, వ్యాపార విలువ తెలిస్తే..  మనమంతా నోరెళ్లబెట్టక తప్పదు! 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు సుమారు 4,078 కోట్ల అధ్యక్ష భవనం(మూడు అమెరికా పెంటాగన్‌ భవనాలతో సమానం), 8 ప్రైవేట్‌ జెట్స్‌, అత్యంత విలువైన ఫుట్‌బాల్‌ క్లబ్‌ కలిగి ఉన్నారు. ఈ రాజ కుటుంబం ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 6శాతం కలిగి ఉంది. అదే విధంగా మాంచెస్టర్ నగరంలోని ఫుట్‌ క్లబ్‌, ప్రముఖ కంపెనీల్లో వందల షేర్లు కూడా ఉన్నాయ. అందులో హాలీవుడ్‌ గాయాని బ్యూటీ బ్రాండ్ నుంచి ఎలాన్ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ సంస్థ వరకు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ షేర్లు ఉండటం గమనార్హం.

యూఏఈ రాజకుటుంబానికి చెందిన మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద సుమారు 700 ఖరీదైన కార్లు ఉన్నారు. అందులో ప్రపంచంలోనే  అతిపెద్ద SUV వాహనంతో పాటు ఐదు బుగట్టి వేరాన్‌లు, ఒక లంబోర్గిని వరెన్టన్‌, ఒక మెర్సిడెస్‌ బెంజ్‌ CLK GTR, ఒక ఫెరారీ 599XX, ఒక Mc12 ఆర్‌ఎన్‌ వాహనాలు ఉన్నాయి.

ఇక.. ఈ రాజకుటుంబం నివాసం ఉండే  కస్ర్ అల్-వతన్ ( యూఏఈ అధ్యక్ష భవనం)  ఆ దేశంలోనే అత్యంత పెద్ద రాజభవనంగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్‌ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3,50,000 ప్రత్యేకమైన క్రిస్టల్స్‌లో తయారు చేయబడిన షాన్డీలియర్‌,  విలువైన చారిత్రక కళాఖండాతో పాలెస్‌ అబ్బుర పరిచేలా ఉంటుంది.

మరోవైపు అధ్యక్షుడి సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. రాజకుటుంబంలోనే ప్రధానమైన పెట్టుబడి కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని విలువ ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 235 బిలియన్‌ డాలర్లు. ఈ కంపెనీ వ్యవసాయం, చమురు, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది. అదీకాక కంపెనీ పదివేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. 

యూఏఈ కాకుండా ఈ రాజ కుటుంబానికి లండన్‌, పారిస్‌ వంటి ప్రపంచశ్రేణి నగరాల్లో విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. ఇక రాజ కుటుంబంలోని మాజీ కుటుంబ పెద్దకు ‘లండన్‌ భూస్వామి’ అనే పేరు ఉండటం విశేషం. 2015లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం బ్రిటన్ రాజ కుటుంబంతో పోటీపడే ఆస్తులు యూఏఈ రాజ కుటుబానికి ఉన్నాయని పేర్కొన్నారంటే.. వీరి ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!​ 2008లో మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌.. యూకే ఫుట్‌బాల్‌ టీం(మాంచెస్టర్‌ సీటీ)ను సుమారు 2,122 కోట్ల భారీ ధరకు కోనుగోలు చేసి సంచలనం సృష్టించారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ది 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు గల పెద్ద రాజ కుటుంబం. ఆయనకు 9 మంది పిల్లలు, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉండటం గమనార్హం.

చదవండి: ఇరాన్‌పై ప్రతీకారదాడి.. పాక్‌ అమెరికాను సంప్రదించిందా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top