
యూఏఈ(UAE) విదేశాల నుంచి తమ దేశం వస్తున్న టూరిస్ట్‌లు, వర్కింగ్ వీసాదారులను తాత్కాలికంగా నిలిపేసిందని(Suspension) కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే దీనిపై యూఏఈ అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. కథనాల్లోని వివరాల ప్రకారం.. యూఏఈ తొమ్మిది దేశాల టూరిస్ట్ వీసాలు, వర్కింగ్ వీసాల(tourist and work visas) జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ జాబితాలో భారత్ లేదని గమనించాలి. యూఏఈ వీసాలు నిలిపేసిన దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అఫ్గానిస్థాన్
లిబియా
యెమెన్
సోమాలియా
లెబనాన్
బంగ్లాదేశ్
కామెరూన్
సూడాన్
ఉగాండా
ఈ సస్పెన్షన్ కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. పైన తెలిపిన దేశాల నుంచి వచ్చి ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న వీసా హోల్డర్లకు ఎలాంటి సమస్య లేదు.
ఈ నిర్ణయానికి కారణం..
భద్రతా ఆందోళనలు: ఇంటెలిజెన్స్ నివేదికలు ఉగ్రవాదానికి సంబంధించిన సంభావ్య ప్రమాదాలను సూచిస్తున్నాయి.
దౌత్యపరమైన ఉద్రిక్తతలు: కొన్ని దేశాలకు యూఏఈ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది వీసా విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
ప్రజారోగ్య ప్రోటోకాల్స్: కరోనా నియంత్రణలో ఉన్నప్పటికీ యూఏఈ కఠినమైన ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ భద్రతా చర్యలను అమలు చేస్తూనే ఉంది. తక్కువ టీకా రేట్లు లేదా అస్థిరమైన ఆరోగ్య డేటా రిపోర్టింగ్ ఉన్న దేశాలు దీని వల్ల ప్రభావితం అవుతున్నాయి.
మైగ్రేషన్ మేనేజ్‌మెంట్: కార్మికుల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి యూఏఈ తన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునసమీక్షిస్తోంది.
ఇదీ చదవండి: హెచ్-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్ వేతనాలు ఇలా..