
షార్జాలో మరో మలయాళీ మహిళ మరణం ఆందోళన రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారు జామున యుఎఇలోని షార్జా అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.
గల్ఫ్ న్యూస్ ప్రకారం, అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూసింది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం,ఆమె భర్త సతీష్ ఆమెను గొంతు పిసికి, కడుపుపైతన్నాడు, తలపై ప్లేట్‌తో కొట్టాడు, ఫలితంగానే ఆమె మరణించింది. మృతురాలికి పదేళ్ల కుమార్తె కూడా ఉంది. అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ప్రస్తుతం కొల్లాంలో తన అమ్మమ్మ, తాతాయ్య రాజశేఖరన్ పిళ్లై , తులసి భాయ్‌లతో ఉంది అతుల్య మరణం భారతీయ సమాజాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.
చదవండి: లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే

2014లో సతీష్, అతుల్య వివాహం జరిగింది. భర్త సతీష్‌తో కలిసి షార్జాలో నివసిస్తోంది అతుల్య అప్పటినుంచీ బైక్, 43 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, తగినంత కట్నం తీసుకురాలేదని పదేపదే వేధించే వారని అతుల్య కుటుంబం ఆరోపిస్తోంది. అల్లుడు మద్యానికి బానిస అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని అతుల్య తండ్రి ఆరోపించారు.పాప కోసంమే తన బిడ్డ అన్ని హింసలను భరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు సంబంధించి గతంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలకు జరిగాయి. పోలీసు కేసు కూడా నమోదైంది.
ఇదీ చదవండి: బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్‌ఆర్‌ఐ జంట
అయితే ఈ ఆరోపణలను సతీష్ ఖండించాడు. అతుల్య మరణంలో తన పాత్ర లేదని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే తాను నమ్మడం లేదన్నాడు. కాగా యూఏఈ షార్జాలో వరకట్న వేధింపుల కారణంగా కేరళకు చెందిన మహిళ బిడ్డను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన 16 నెలల కుమార్తెను హత్య చేసి, తాను తనువు చాలించిన సంగతి తెలిసిందే.