
రూ. 33 కోట్ల స్కాం, భారతీయ జంట అరెస్ట్
టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన భారతీయ సంతతికిచెందిన దంపతులు రియల్ ఎస్టేట్ స్కామ్‌లో 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. రూ. 33 కోట్ల విలువైన పెట్టుబడి స్కాం ఆరోపణలపై వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర టెక్సాస్‌లోని ఇండియన్-అమెరికన్ సమాజంలో సిద్ధార్థ సామీముఖర్జీ , అతని భార్య సునీత ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యారు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఛారిటీలు ,బాలీవుడ్ తరహా ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించారు. అలా రూ.33 కోట్లకు నమ్మినవారిని ముంచేశారు. రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలు , మహమ్మారి సహాయ నిధుల దుర్వినియోగం, ఇలా పలు రకాలు ఏళ్ల తరబడి మోసపూరిత ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారనే అభియగాలు నమోదైనాయి.ఈ జంట నకిలీ కంపెనీని ఉపయోగించి, ఫేక్ సాలరీ స్లిప్పుల ద్వారా పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) రుణాన్ని పొందారని ఆరోపించారు.ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు.
ఇదీ చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం
ఈ జంట ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో వీరి బండారం వెలుగులోకి వచ్చింది. కనీసం 20 మంది బాధితులను గుర్తించారు. తొలుత ఈ కేసును విచారించిన డిటెక్టివ్‌లు ఆ తరువాత ఈ కేసును FBIకి అప్పగించారు. 100 మందికి పైగా వ్యక్తులను మోసంచేశారంటూ అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ జంటను అరెస్ట్‌చేశాయి. నిజానికి బాధితుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. తన 23 ఏళ్ల సర్వీసులు ఇంతటి మోసగాడిని చూదడలేదని డిటెక్టివ్ బ్రియాన్ బ్రెన్నాన్ వ్యాఖ్యానించారు.

అరెస్టు తర్వాత, సామీ , సునీతా ముఖర్జీ ఇద్దరూ 5 లక్షల డాలర్ల చొప్పున బెయిల్‌ను దాఖలు చేశారు. సామీని తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. డబ్బును క్రిప్టోకరెన్సీ ఖాతాలుగా మార్చారా అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ముంబైలో కూడా సామిపై మోసానికి పాల్పడినట్టు ఆరోపలున్నాయట. విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ముఖర్జీ దంపతులు ఈ ఏడాది మేలో అంటే అరెస్టుకు కొన్ని వారాల ముందు, ప్లానోలో ఎన్‌జీవీ పేరుతో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి హేమ మాలిని, ప్లానో మేయర్ సహా ఉన్నత స్థాయి అతిథులు హాజరు కావడం గమనార్హం.
చదవండి:
