
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్‌లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్‌గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.
దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.
‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్‌లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్‌గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్‌ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు.