షార్జాలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు! | AP CM YS Jagan Birthday Celebrations At Sharjah UAE | Sakshi
Sakshi News home page

షార్జాలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు!

Dec 21 2023 3:34 PM | Updated on Dec 21 2023 4:08 PM

AP CM YS Jagan Birthday Celebrations At Sharjah UAE - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు షార్జాలోని కింగ్ ఫైసల్ పార్కులో సంఘ సేవకులు రిజవాన్‌గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనేక మంది అభిమానుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ గారి పుట్టిన రోజుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ కన్వీనర్  సయ్యద్ అక్రమ్, ఇర్షాద్,  అబ్దుల్లా, చక్రి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మరోసారి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా తీసుకువెళ్లాలి అని ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణుల్ని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌ఆర్టీసీ ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వెంకట్ గారు, బీహెచ్‌ ఇలియాస్ గారు ప్రవాసాంధ్రలు అభివృద్ధి కొరకు ప్రభుత్వంతో సమన్వయము చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కొరకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు.

(చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు!)

Advertisement
 
Advertisement
Advertisement