iran consulate general
-
ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : జీసీసీ
ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ స్పందించింది. ఈ దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. అబుదాబి, రస్ ఆల్ ఖైమాలపై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అబుదాబిలో గిడ్డంగులు దెబ్బతిన్నాయి. ఇరాన్ దాడి తర్వాత జెబెల్ అ లీ ఓడరేవు నుండి పొగలు ఎగసిపడుతున్నాయి.కాగా.. అబుదాబి, రస్ అల్ ఖైమాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో యుఎఇ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. నిన్న మధ్యాహ్నం ముసాఫా పారిశ్రామిక ప్రాంతంపై ఈ దాడి జరిగింది. ముసాఫా, ఐసిఎడిలోని గిడ్డంగులను క్షిపణి శిథిలాలు తాకాయి. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు. సాయంత్రం జరిగిన దాడిలో ఓ క్షిపణి యూఎస్ సైనిక స్థావరంలోని నిల్వ కేంద్రం దగ్గర పడింది. ఆ సమయంలో భారీ పేలుడు జరిగింది.నిన్న రస్ అల్ ఖైమాలో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. వెంటనే అగ్నిమాపక దళం అదుపులోకి తీసుకొచ్చింది. చమురు, ఇంధన వనరులపై దాడి చేసిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ ప్రకటించింది. అయితే అబుదాబి, రస్ అల్ ఖైమాను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను యూఏఈ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. కొన్ని గిడ్డంగులు శిథిలాల నుండి నష్టపోయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
హరితహారానికి ఇరాన్ కాన్సులెట్ ప్రశంసలు
అనంతపద్మనాభ స్వామి సన్నిధిలో కాన్సులెట్ జనరల్ నౌరియన్ కుటుంబసభ్యులు వికారాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం చాలా బాగుందని ఇరాన్ కాన్సులేట్ జనరల హాసన్ నౌరియన్ ప్రశంసించారు. రెండు రోజుల పాటు అనంతగిరిలో కుటుంబసమేతంగా గడిపేందుకు వచ్చిన ఆయన హరిత రిస్టార్స్‌లో బస చేశారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హరితహారం చేపట్టడం మంచి పరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ మంచి పాలన దీక్షుడని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా పేరుతో లక్షలాది కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇరాన్‌కు భారతీయులకు మధ్య బేధాలు పెద్దగా ఉండవన్నారు. ఇరాన్ రాయబార కార్యాలయాలు దేశంలో మూడు ప్రాంతాల్లో ఉన్నాయని ఇవి ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సహకారాన్ని ఎప్పటికప్పుడు అందించుకుంటూ పనిచేస్తాయని తెలిపారు. నరేంద్రమోదీ ఇరాన్ వచ్చినప్పుడు తమ దేశం ఘన స్వాగతం పలికిందని, ఇరాన్ ప్రధాని ఇక్కడి కూడా వచ్చారని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగయ్యాయని తెలిపారు. ఇరాన్లో తొంబై శాతానికి పైగా ముస్లింలే ఉంటారని చెప్పారు. భారతదేశంలో వివిధ రకాల భాషలు, కులాలు, సంస్కృతుల ఉన్నా ఐకమత్యంగా ఉంటారని తెలిపారు.


