
కొందరు పేరెంట్స్ తమ పిల్లల ఫోటోలు, వీడియోలు, వారికి సంబంధించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యం నుంచి వచ్చిందే... షేరెంటింగ్(షేరింగ్ + పేరెంటింగ్)
‘చిన్న పిల్లల వీడియోలే కదా... షేర్ చేస్తే ఏమిటి అనుకుంటారుగానీ దీని వల్ల ప్రైవసీ, సేఫ్టీ కోణంలో ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి’ అంటున్నారు నిపుణులు.
ఇక మరో ట్రెండ్... పాపింగ్ ఇమోజీ
ఈ ట్రెండ్ ప్రత్యేకత ఏమిటంటే పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ వారి ముఖాలను ఇమోజీలతో కవర్ చేయడం. మొదట్లో ఈ ఫేస్ ఇమోజీ ట్రెండ్ సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు సామాన్యుల వరకు వచ్చింది.
‘ముఖాలను ఇమోజీలతో కవర్ చేసినంత మాత్రాన ఎలాంటి సమస్యలు ఉండవు అనుకోవడం భ్రమ మాత్రమే’ అంటున్నారు ఆన్‌లైన్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌లు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ఇమోజీ–కవర్డ్ ఫోటోల ఫేస్‌లను రీకన్‌స్ట్రక్షన్ చేయవచ్చు అని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు.
పిల్లలు ఫోటోలు, వీడియోలు, వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరిౖయెనదా? కాదా? అనే చర్చ మాట ఎలా ఉన్నా అతిగా షేర్ చేయడం తప్పు అంటున్నారు నిపుణులు.
(చదవండి: