
ముంబై: మూత్రం తాగితే.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయి. షూతో మొహ పగలగొడితే కలిసొస్తుంది. చెట్లు ఆకులు తింటే కోరుకున్న సంస్థలో కోరుకున్నంత జీతం. ఇలా ఒకటేమిటి.. నేను చెప్పిన పని చేస్తే.. ఇక మీ జీవితంలో తిరుగుతుండదంటూ బాబా ప్రచారం.. అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజినగర్ జిల్లా శివూర్ గ్రామంలో బాబా,అఘోరీ బాబా అలియాస్ సంజయ్ పాగారే అమాయకులైన గ్రామస్తులపై దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పటికే జిల్లాలోని తనని నమ్మిన వారికి ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు ప్రసాదించానని, మీకు కూడా అలాగే స్వాంతన చేకూర్చుతానంటూ గ్రామంలో తిష్టవేశాడు.
పలు సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు తన మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మించాడు. దీంతో మోసపోయిన బాధితులు అతని మూత్రం తాగాల్సి వచ్చింది. అంతే కాదు ,మహిళలు,పురుషుల్ని దండలతో దండించాడు. షూతో మొహం మీద దాడి చేశాడు. అంతటితో ఆగలేదు. స్థానికంగా ఉన్న ప్రార్ధినా మందిరం చూట్టూ ప్రదిక్షణలు చేయమన్నాడు. అక్కడి చెట్ల ఆకులు తినమన్నాడు. బాధితుల్ని పడుకోబెట్టి వారి ముఖంపై నడవడం, పసుపు పొడి చల్లడం, షూ వాసన చూపించడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో దొంగబాబాల్ని ఆటకట్టించే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టి సంజయ్‌ను పోలీసులకు పట్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.