అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్‌‌ | Punjab MLA Harmit Singh Pathanmajra Arrested on Rape Charges | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్‌‌

Sep 2 2025 11:51 AM | Updated on Sep 2 2025 12:37 PM

Punjab AAP MLA Harmit Singh Pathanmajra Arrested

సనౌర్: పంజాబ్‌లోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రాను అత్యాచారం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్‌  చేశారు. హర్మిత్ సింగ్ మాజీ భార్య ఆయనపై అత్యచార ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఈ అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదుకాగా, మంగళవారం ఉదయం హర్యానాలోని కర్నాల్‌లో పంజాబ్‌లోని కర్నాల్‌లో ఎమ్మెల్యే హర్మిత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్,  జల వనరుల ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌పై సనూర్ ఎమ్మెల్యే విమర్శలు చేసిన దరిమిలా  ఈ పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10.17 గంటలకు పఠాన్‌మజ్రా మాజీ భార్య.. పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో  ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. ఆమె పేర్కొన్నా వివరాల ప్రకారం 2014,ఫిబ్రవరి 12 నుంచి 2024 జూన్ 12 వరకు ఈ నేరం జరిగిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేపై భారతీయ శిక్షాస్మృతిలోని 376, 420,506 సెక్షన్ల కింద అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల అభియోగాలపై కేసు నమోదు చేశారు.

పఠాన్‌మజ్రాను అతని బంధువుల గ్రామమైన దబ్రీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠన్‌మజ్రా.. ఢిల్లీకి చెందిన ఆప్ నేతల లైంగిక కార్యకలాపాల వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వారు తనపై అత్యాచారం కేసు పెట్టారని, తాను కోర్టులో దానిని ఎదుర్కొంటానని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ-పంజాబ్ మధ్య కబడ్డీ ఆట జరుగుతున్నదని  ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement