
అమృత్‌సర్: నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత భద్రతా బలగాలు షాకిచ్చాయి. పంజాబ్ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్‌ఎఫ్ పాక్ నుంచి భారత్ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు డ్రోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో మూడు డ్రోన్లు ఏరియల్ ఫొటోగ్రఫీ,వీడియోల్ని తీసేందుకు ఉపయోగించే డీజీఐ మావిక్ డ్రోన్‌లు కాగా.. మరో మూడు డ్రోన్లలో మూడు పిస్టల్స్,వాటిల్లో బుల్లెట్లను నింపేందుకు వినియోగించే మ్యాగిజైన్‌ను,1.1 కేజీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ విభాగం అధికారికంగా ప్రకటించింది.
అమృత్‌సర్ జిల్లాలోని మోధే గ్రామం వద్ద రాత్రి సమయంలో ఐదు డ్రోన్లను బీఎస్‌ఎఫ్ జవాన్లు టెక్నాలజీ సాయంతో వాటిని కూల్చేశారు. అక్కడ మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు,హెరాయిన్ ఉన్న నాలుగు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టర్న్ టారన్ జిల్లాలోని డాల్ గ్రామం వద్ద పిస్టల్ భాగాలు, మ్యాగజైన్‌ను గుర్తించారు. అటారి గ్రామం వద్ద మరో డ్రోన్‌ను అడ్డుకుని రెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు.
భారత భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ ప్రేరిత నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌లపై గట్టి దెబ్బగా భావిస్తున్నారు. బీఎస్‌ఫ్, పంజాబ్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.కాగా, ఇలాంటి ఘటనలు సరిహద్దు భద్రతను మరింత కఠినంగా చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.