
మానవతావాదులు తాము ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయం చేయడానికి రంగంలోకి దిగుతారు. భారీ వర్షాల వల్ల పంజాబ్‌లో జన జీవితం అస్తవ్యస్తం అయింది. ఒక వృద్ధుడు టీ కెటిల్‌తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ, తడుస్తూ ఎక్కడ వరద బాధితులు కనిపించినా వారికి టీ అందజేస్తూ వెళుతున్నాడు. బాధితులకు ధైర్యవచనాలు చెబుతున్నాడు.
నిజానికి అతడు కూడా వరద బాధితుడే! వర్షాల దెబ్బకు వంట అనేది లేకుండా ఆకలిదప్పులతో నీరసించిపోయిన బాధితులకు ఆ కాస్త టీ ఎంతో కొంత ఉమశమనం ఇచ్చింది. క్రికెటర్ హర్బజన్‌సింగ్ (Harbhajan Singh) ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.
చదవండి: ఏఐ చాట్‌బాట్‌లకు లింగ వివక్ష ఉంటుందా?
‘పంజాబీలను అనుకరిస్తూ కొద్దిమంది జోక్‌లు చేస్తుంటారు. ఈ వీడియో చూసి అయినా వారిలో మార్పు రావాలి. పంజాబీ ప్రజల మానవత్వాన్నికి చిన్న ఉదాహరణ ఈ వీడియో’‘ కష్టాలు... అని బాధపడుతుంటాంగానీ ఆ కష్టాలే మనుషులను దగ్గర చేస్తాయి. మానవత్వాన్ని పరీక్షిస్తాయి’... ఇలా రకరకాలుగా స్పందించారు యూజర్‌లు.
When volunteers went to deliver relief materials, the flood-affected family despite having lost almost everything prepared tea and served it to the volunteers in return. That’s the spirit of Panjab. Rab de bande. #Punjab #PunjabFloods pic.twitter.com/EVdCuHlKuP
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 3, 2025