
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పంజాబ్ నుంచి రాజ్యసభకు(Rajyasaba) పోటీలో ఉంటారని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆప్(AAP) నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి, ఇటీవలి ఉప ఎన్నికలో లుథియానా వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన అరోరా స్థానంలో కేజ్రీవాల్ పోటీలో ఉంటారన్న చర్చ జరుగుతోంది.
అయితే, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఓటింగ్ కాగా, నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 13 ఆఖరు తేదీ. రాజ్యసభకు వెళితే జాతీయ అంశాలపై ఎన్‌డీయేను ఢీకొట్టడంతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయగలరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్(AAP)నకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ ఓడిపోయారు. ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు.