
ఆగ్రా: సామాజిక సేవకు లింగ భేదం అడ్డుకాదని మరోసారి నిరూపించే సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్‌జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.
ఈ సహాయాన్ని సమీకరించేందుకు ఆగ్రాలోని ట్రాన్స్‌జెండర్ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.మనదేశంలో కష్టాల్లో ఎవరున్నా సరే మానవత్వం చూపించాల నినాదంతో తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంగా వచ్చిన మొత్తాన్ని పంజాబ్‌కు పంపించారు.
आगरा में किन्नरों ने 25 लाख रुपए इकट्ठा करके
बाढ़ पीड़ितों को मदद भिजवाई है pic.twitter.com/rEPuXEw5uQ— Birendra Kumar Yadav (@BirendraYdvSP) September 11, 2025
ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్డులో 'ఆల్ ఇండియా కిన్నార్ సమాజ్ కాన్ఫరెన్స్' జరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు పది వేల మంది ట్రాన్స్‌జెండర్ల ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించింది. ఇతర ట్రాన్స్‌జెండర్ల నుంచి నుండి వచ్చిన విరాళాలు 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ పంజాబ్ వరద బాధితుల కోసం డబ్బును విరాళంగా ఇచ్చిన తర్వాత బిడ్‌లు వేసింది. కొందరు రూ.50,000 విరాళంగా ఇవ్వగా ..మరికొందరు రూ.లక్ష వరకు విరాళం ఇచ్చారు. అత్యధిక విరాళం గోరఖ్‌పూర్ నుండి వచ్చింది.