
భారీ వర్షాలతో పంజాబ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నం చేశాయి. అయతే, తాజాగా బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన వంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అయితే, దానిని తాను విరాళం అనుకోవడంలేదని పేర్కొన్నారు. డొనేషన్ అనే పదం తనకు నచ్చదని తెలిపారు. ఇతరులకు డొనేట్ చేసేందుకు నేనెవరిని..? అంటూనే ఇలా సాయం చేయడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి అదృష్టంగా భావిస్తుంటానని తెలిపారు.