
చండీగఢ్: పంజాబ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 1,400 కి పైగా గ్రామాలు నీట మునిగాయి. 30 మంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పంజాబ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. పంజాబ్ అంతటా నదులు ఉప్పొంగుతున్నాయి.
VIDEO | Punjab: Heavy rain floods homes in Hoshiarpur’s Hukumat village; 28 villages affected.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/7VT5BcaTF2— Press Trust of India (@PTI_News) August 31, 2025
రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని పలు గ్రామాల రోడ్లను వరదలు ధ్వంసం చేశాయి. 1,400 కి పైగా గ్రామాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. 3.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను దెబ్బతిన్నాయి. భారీ వర్షాల దృష్ట్యా సెప్టెంబర్ ఏడు వరకు కళాశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హా ఇతర అధికారులు వరద పరిస్థితులను అనుక్షణం గమనిస్తున్నారు.
మరోవైపు బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.పీడబ్ల్యుడీ, జల వనరులు, పీఎస్‌పీసీఎల్ విభాగాలను అత్యవసర విధుల్లో ఉంచారు. పంజాలోని గురుదాస్‌పూర్‌లో 94.7 మి.మీ వర్షం పడగా, మొహాలిలో 55.5 మి.మీ వర్షం కురిసింది. రోపర్‌లో, సట్లెజ్ నది తీరం వెంబడి ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.