
హోషియార్‌పూర్/భటిండా/జైపూర్: పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ పంజాబ్‌లోని హోషియార్‌పూర్, భటిండా జిల్లాల్లో క్షిపణి విడి భాగాలుగా భావిస్తున్న శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గురువారం రాత్రి హోషియార్‌పూర్ జిల్లాలోని పొలంలో క్షిపణి భాగాలుగా భావిస్తున్న లోహపు శకలాలను గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, విచారణ చేపట్టాయి.
అదేవిధంగా, భటిండా జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని శకలాలు రెండు ప్రాంతాల్లో పడిపోయాయి. అంతకుముందు మెరుపులు మెరవడంతోపాటు, పెద్ద శబ్దం వినిపించిందని రైతులు తెలిపారు. శకలాలు పడిన ప్రాంతంలో ఓ ఇంటి కిటికీలు, తలుపులు, పశువుల షెడ్ ధ్వంసమయ్యాయన్నారు. శకలాలు పడిన ప్రాంతంలో మూడడుగుల లోతు గుంత ఏర్పడిందని రైతులు తెలిపారు.
ఇందుకు సంబంధించిన సమాచారం ఆరీ్మకి మాత్రమే తెలుస్తుందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆ శకలాలను తాకవద్దని స్థానికులను హెచ్చరించారు. భటిండా జిల్లా బుర్జ్ మహిమా గ్రామంలోనూ లోహపు శకలాలు కనిపించాయి. పఠాన్‌కోట్ జిల్లాలో షెల్ వంటి లోహపు శకలం కనిపించిందని అధికారులు తెలిపారు. గురువారం పాకిస్తాన్ ఈ ప్రాంతంపై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత బలగాలు ధ్వంసం చేయడం తెల్సిందే.
రాజస్తాన్‌లో బాంబు స్వా«దీనం
రాజస్తాన్‌లోని జైసలీŠమ్‌ర్ జిల్లా కిషన్‌ఘాట్ ప్రాంతంలో శుక్రవారం బాంబు వంటి వస్తువు కనిపించడం కలకలం రేపింది. నర్సరీ వద్ద ఈ వస్తువు కనిపించడంతో, ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, దగ్గరికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు నిర్విర్యం చేయనున్నారని వివరించారు. గురువారం సాయంత్రం జైసలీ్మర్‌లో భారీ శబ్దాలతో పేలుళ్లు గంటపాటు కొనసాగడంతో, అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపేశారు.