breaking news
Fragments
-
నెహ్రూ విశ్వాస ఘాతుకం
న్యూఢిల్లీ: మహోన్నతమైన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని, ఈ గీతం విషయంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి నెహ్రూ లొంగిపోయారని, వందేమాతరం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ గీతంలో ముఖ్యమైన చరణాలు తొలగించారని మండిపడ్డారు. వందేమాతరం 150 వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ గీతానికి అన్యాయం చేసిందెవరో భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ 1937లో వందేమాతరానికి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేసిందని వెల్లడించారు. దు్రష్పచారాన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్, నెహ్రూ అందుకు వత్తాసు పలికారని, గీతాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. జిన్నా వ్యతిరేకించిన తర్వాత నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, వందేమాతర గీతం ముస్లింలను రెచ్చగొట్టేలా, అసహనం కలిగించేలా ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. 1937లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ గీతానికి నిజంగా అంత గొప్పదనం ఉందా? అంటూ సమీక్ష చేశారని తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ తీరు చూసి దేశంమొత్తం ది్రగ్బాంతికి గురైందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయని వెల్లడించారు. సామాజిక సామరస్యం ముసుగులో వందేమాతరాన్ని ముక్కలు చేయడం ద్వారా దేశాన్ని బుజ్జగింపు రాజకీయాల దిశగా నడిపించారని, చివరకు దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తంచేశారు. గాందీజీ కోరినా అన్యాయం చేశారు ‘‘బంకిం దా(బంకించంద్ర చటర్జీ) 1875లో వంతేమాతరం గీతం రాశారు. వెంటనే ఇది స్వాతంత్య్ర సమరయోధుల గళాల్లో నినాదంగా మారింది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తినిచి్చంది. ప్రజల సంకల్పానికి ఒక ప్రతీకగా మారింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి బలమైన సవాలుగా నిలిచింది. వందేమాతరాన్ని నిషేధించడానికి బ్రిటిష్ పాలకులు ఎన్నో కుట్రలు చేశారు. ఈ గీతాన్ని ప్రచురించకుండా, ఆలపించకుండా చట్టాలు తీసుకొచ్చారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా బంకించంద్ర చటర్జీ వెనక్కి తగ్గలేదు. ఆత్మస్థైర్యంలో సవాలును ఎదుర్కొన్నారు. వందేమాతరం ఇచి్చన బలంతో కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం పట్ల బ్రిటిషర్లు ద్వేషం ప్రదర్శించారు. 1905లో బెంగాల్‌ను విభజించారు. అయినా సరే వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచే ఉంది. గత శతాబ్దంలో వందేమాతరం చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని జాతీయ గీతం మార్చాలని కోరుతూ మహాత్మాగాంధీ 1905లో లేఖ రాశారు. అయినప్పటికీ గీతానికి అన్యాయం జరిగింది. గాంధీజీ అభిమతాన్ని కూడా లెక్కచేయని శక్తివంతులైన వ్యక్తులెవరో ప్రజలు తెలుసుకోవాలి. ఎలాంటి సవాలునైనా తిప్పికొట్టగలం దేశానికి సవాళ్లు ఎదురైనప్పుడల్లా వందేమాతరం ఇచ్చిన స్ఫూర్తితో దీటుగా ప్రతిస్పందిస్తున్నాం. చరిత్రలో కొన్ని ఘట్టాలను పక్కనపెడితే.. ప్రతికూల పరిస్థితుల్లో దేశం ఒక్కటవుతోంది. ఆహార భద్రత సంక్షోభం ఎదురైనప్పుడు మన రైతులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పండించి ప్రజల ఆకలి తీర్చారు. ఇందుకు వందేమాతరమే స్ఫూర్తి. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను కూడా ఈ స్ఫూర్తి ఓడించింది. యుద్ధాలు జరిగినప్పుడు మన సైనికులు శత్రువులను చిత్తు చేశారు. కోవిడ్–19 సంక్షోభాన్ని కలిసికట్టుగా అధిగమించాం. వందేమాతరం మనకు సమైక్యత, బలం, సామర్థ్యాన్ని అందిస్తోంది. ఎలాంటి సవాలునైనా మనం తిప్పికొట్టగలం. వందేమాతరం అంటే కేవలం ఒక గీతం కాదు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బలమైన స్ఫూర్తి. ‘స్వదేశీ’ నినాదానికి మరింత బలం చేకూర్చాలి. వందేమాతరమే మన మంత్రం. వందేమాతరం నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇది విలువల ప్రవాహం. వేదాల్లోని సత్యాన్ని చాటిచెబుతోంది. భూమే మన తల్లి, మనం ఈ భూమి బిడ్డలం అని తెలియజేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుతగలడానికి పలుమార్లు ప్రయతి్నంచారు. నినాదాలు చేశారు. మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను తృణమూల్ కాంగ్రెస్ ఔట్‌సోర్సింగ్‌కు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని చురక అంటించారు. ఆనాటి వైభవాన్ని పునరుద్ధరించాలి ‘‘పవిత్రమైన వందేమాతరం మనకు గర్వకారణం. 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలుస్తున్నందుకు మనమంతా గరి్వంచాలి. వందేమాతరం దశాబ్దాలుగా మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది. గీతానికి 50 ఏళ్లు పూర్తయిన సమయంలో మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశం ఎమర్జెన్సీ పడగ నీడలో ఉంది. అప్పట్లోదేశభక్తులను జైల్లో పెట్టారు. రాజ్యాంగం గొంతు కోశారు. దురదృష్టవశాత్తూ ఎమర్జెన్సీ సమయంలో చీకటి కాలం నడిచింది. గీతానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన వందేమాతరం వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇదొక గొప్ప అవకాశం’’ అని మోదీ అన్నారు. భారతీయ విశ్వాసాలకు ప్రతీక ‘‘వందేమాతరం భారతీయ విశ్వాసాలు, విలువలకు ప్రతీక. ఈ గీతం దేశ సామరస్యం, బలాన్ని, సంస్కృతిని, మాతృత్వాన్ని సూచిస్తుంది. నేటికీ ప్రతి భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మందిని ముందుకు నడిపించింది. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి కలి్పంచాలన్న స్ఫూర్తిని రగిలించింది. దేశ సంకల్పానికి గుర్తుగా నిలిచింది.’’ – ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్ వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం కాదు ‘‘వందేమాతరం గీతం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం జరిగింది. అప్పట్లో బెంగాల్ నవాబ్, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలనే ఇందులో ప్రస్తావించారు. కరువు కాలంలో పన్నుల పేరిట ప్రజలను పీడించిన పాలకుల గురించి ఆనంద్‌మఠ్ గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలోనే వందేమాతరం తొలుత ప్రచురితమైంది. దాంతో ఈ గీతం ముస్లింలకు వ్యతిరేకమనే వాదన మొదలుపెట్టారు. వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం అన్న వాదనలు ఏమాత్రం వాస్తవం లేదు. నిజాలు బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వందేమాతరం స్థాయిని తగ్గించే ప్రయత్నం జరిగింది. తొలగించిన చరణాలు భారతీయతను వివరిస్తాయి. పూర్తి గీతం గురించి అందరూ తెలుసుకోవాలి’’ – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి బీజేపీ నేతలకు వందేమాతరం అర్థం తెలుసా? ‘‘ఒకరి విశ్వాసాలను మరొకరిపై రుద్దడానికి వందేమాతరం గీతాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడడం సరైంది కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ నాయకులు ఇప్పుడు వందేమాతరం విలువల గురించి మాట్లాడుతున్నారు. వందేమాతరం స్ఫూర్తిని యథాతథంగా అలవర్చుకోవాలి. సొంతం ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం దారుణం. జాతీయ గీతాన్ని వారే సృష్టించినట్లు అధికార పార్టీ నాయకులు డ్రామాలాడుతున్నారు. ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. జాతీయ గీతం రాజకీయ ఆయుధం కాకూడదు. బీజేపీ నాయకులకు వందేమాతరం అర్థం తెలుసా? విభజన శక్తులు ప్రజల్లో చిచ్చు పెట్టడానికి వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయి’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హిందువులకే సొంతమన్నట్లు చిత్రీకరించారు వందేమాతరం గీతం హిందువులకే సొంతం అన్నట్లుగా 20వ శతాబ్దం మొదట్లో చిత్రీకరించారు. దీంతో ముస్లింలకు సంబంధం లేదన్నట్లుగా అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారు. వందేమాతరం హిందువులదే అని చెప్పిన వ్యక్తులే అసలు వివాదానికి కారకులు. హిందువులకు ఈ గొడవతో సంబంధం లేదు. వందేమాతరాన్ని ముక్కలు చేయడం వల్లే దేశం ముక్కలైందని ప్రధాని మోదీ ఆరోపించడం గర్హనీయం. వందేమాతరం స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలి’’ – ఎ.రాజా, డీఎంకే ఎంపీ బెంగాల్ ఎన్నికల కోసమే బీజేపీ ఆరాటం వచ్చే ఏడాది జరిగే పశి్చమ బెంగాల్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ దృష్టిపెట్టింది. రాజకీయ లబ్ధి కోసం వందేమాతరాన్ని వాడుకుంటోంది. వందేమాతరం ఆత్మను బీజేపీ హత్య చేస్తోంది. 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం కంటే ఇప్పు డే ఎక్కువ అన్యాయం జరుగుతోంది. సరిగ్గా బెంగాల్ ఎన్నికల ముందే వందేమాతరంపై పార్లమెంట్లో చర్చ చేపట్టారంటే బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జాతీయ గీతాన్ని బీజేపీ నాయకులు సరిగ్గా ఆలపించగలరా? స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని వ్యక్తులు నేడు వందేమాతరానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. బీజేపీ పాలనలో వందేమాతరం స్ఫూర్తి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ నిర్వాకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వందేమాతరంపై చర్చ సాగిస్తున్నారు’’. – మహువా మొయిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ -
పంజాబ్‌లో క్షిపణి శకలాలు
హోషియార్పూర్/భటిండా/జైపూర్: పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ పంజాబ్‌లోని హోషియార్పూర్, భటిండా జిల్లాల్లో క్షిపణి విడి భాగాలుగా భావిస్తున్న శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గురువారం రాత్రి హోషియార్పూర్ జిల్లాలోని పొలంలో క్షిపణి భాగాలుగా భావిస్తున్న లోహపు శకలాలను గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, విచారణ చేపట్టాయి. అదేవిధంగా, భటిండా జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని శకలాలు రెండు ప్రాంతాల్లో పడిపోయాయి. అంతకుముందు మెరుపులు మెరవడంతోపాటు, పెద్ద శబ్దం వినిపించిందని రైతులు తెలిపారు. శకలాలు పడిన ప్రాంతంలో ఓ ఇంటి కిటికీలు, తలుపులు, పశువుల షెడ్ ధ్వంసమయ్యాయన్నారు. శకలాలు పడిన ప్రాంతంలో మూడడుగుల లోతు గుంత ఏర్పడిందని రైతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆరీ్మకి మాత్రమే తెలుస్తుందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆ శకలాలను తాకవద్దని స్థానికులను హెచ్చరించారు. భటిండా జిల్లా బుర్జ్ మహిమా గ్రామంలోనూ లోహపు శకలాలు కనిపించాయి. పఠాన్‌కోట్ జిల్లాలో షెల్ వంటి లోహపు శకలం కనిపించిందని అధికారులు తెలిపారు. గురువారం పాకిస్తాన్ ఈ ప్రాంతంపై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత బలగాలు ధ్వంసం చేయడం తెల్సిందే. రాజస్తాన్‌లో బాంబు స్వా«దీనం రాజస్తాన్‌లోని జైసలీŠమ్ర్ జిల్లా కిషన్‌ఘాట్ ప్రాంతంలో శుక్రవారం బాంబు వంటి వస్తువు కనిపించడం కలకలం రేపింది. నర్సరీ వద్ద ఈ వస్తువు కనిపించడంతో, ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, దగ్గరికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు నిర్విర్యం చేయనున్నారని వివరించారు. గురువారం సాయంత్రం జైసలీ్మర్లో భారీ శబ్దాలతో పేలుళ్లు గంటపాటు కొనసాగడంతో, అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపేశారు. -
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్‌ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్‌కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్‌లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్‌ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్‌ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్‌లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్‌లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్‌లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్‌ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
భూమిపైకి 23 టన్నుల రాకెట్ శకలాలు.. ఎక్కడ పడతాయో తెలియదు!
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్ స్పేష్ స్టేషన్ కోసం మూడో మోడ్యూల్‌ను పంపించేందుకు 23 టన్నుల లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ను అంతరిక్షంలోకి ఇటీవలే ప్రయోగంచింది చైనా. ఆ రాకెట్‌కు చెందిన 23 టన్నుల బరువుండే శకలాలు ఈ వారాంతంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ శిథిలాల వల్ల మానవాళికి ఏర్పడే ప్రమాదంపై అంచనా వేస్తున్నారు. అవి ఎక్కడ పడనున్నాయనే విషయం స్పష్టంగా తెలియదని హెచ్చరిస్తున్నారు. ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపైకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలై శనివారమంతా కొనసాగుతుంది. సుమారు 10 అంతస్తుల పెద్ద భవన అంత పెద్దగా ఉండే ఈ రాకెట్ భూవాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుంది. మిగిలిన కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు.. దీని వల్ల కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరోస్పేస్ కార్పొరేషన్ చెబుతోంది. 88శాతం ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో ఇవి పడే అవకాశముందట. అయితే శకలాల్లో చాలా వరకు జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉండటంతో ముప్పు కాస్త తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్ -
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
తల్లితో అప్పటిదాక చేయి పట్టుకుని తిరిగింది...కొద్ది క్షణాల్లోనే తల్లికళ్లముందే..
భాగ్యనగర్‌కాలనీ: భవనం స్లాబ్ శకలాలు ఆ చిన్నారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. అభం శుభం ఎరగని నాలుగేళ్ల బాలిక నూరేళ్లు నిండేలా చేశాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కూతురు కళ్లముందే విగతజీవి కావడం ఆ తల్లిదండ్రులకు అశనిపాతంలా మారింది. తీరని శోకాన్నే మిగిల్చింది. తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న కూతురు శాశ్వతంగా దూరం కావడం ఆ తల్లిని దుఃఖం సాగరంలో ముంచింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన లాం సునీల్ కుమార్, లోత్ మేరీ దంపతులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. హెచ్ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటూ శాతవాహన నగర్లో బేకరీ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి షరోన్ దిత్య (4) కూతురు ఉంది. మంగళవారం ఉదయం తల్లితో కలిసి ఆ చిన్నారి టిఫిన్ తీసుకొని బేకరికి వెళుతుండగా పక్కనే పాత ఇంటిపై నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి బాలిక తలపై పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయాలై మెదడు బయటపడింది. బంధువుల సహాయంతో సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు చెఆప్పరు. కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తూ.. చిన్నారి మృతికి కారణమైన ఇంటి యజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
ఉప గ్రహాలకు ఉప ద్రవం
మనం వాడుతున్న సాంకేతికతకు... జీపీఎస్, మొబైల్ ఫోన్ల నుంచి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల వరకు అంతరిక్షంలో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలే కీలకం. మరి ఉన్నట్టుండి వాటికేమైనా అయితే? వామ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చిపడబోతోందని కాదుకానీ... భూకక్ష్యలో రద్దీ ఎక్కువమవుతోంది. ఎవరి అవసరాని కొద్దీ వారు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఎలన్‌మస్క్ అయితే స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు శ్రీకారం చుట్టేశారు. లెక్కకు మిక్కిలి బుల్లి శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేస్తున్నారు. వీటన్నింటినీ మోసుకెళ్తున్న రాకెట్ల శకలాలు కొన్ని భూమి మీదపడగా... మిగతా కొన్ని విడిభాగాలు అలా భూకక్ష్యలో తేలియాడుతున్నాయి. అలాగే కాలం చెల్లిన శాటిలైట్లు... వాటినుంచి వేరుపడుతున్న విడిభాగాలు కూడా. ఇవే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రష్యా తాము 1982లో ప్రయోగించిన ‘కాస్మోస్–1408’ ఉపగ్రహం నిరర్ధకంగా మారిందని ఈనెల 15వ తేదీన ఓ మిస్సైల్ ద్వారా దాన్ని పేల్చివేసింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్ఎస్) 80 కిలోమీటర్ల పైభాగంలో ఇది జరగడం గమనార్హం. భూమి లేదా విమానం నుంచి మిస్సైల్‌ను ప్రయోగించి భూకక్ష్యలోని వెళ్లాక దాని గమనాన్ని నియంత్రించి లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేస్తారు. రష్యా శాటిలైట్ పేలిపోవడంతో 1,500 పైచిలుకు శకలాలు అంతరిక్షంలోకి విరజిమ్మబడ్డాయి. ఎఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములను రెండు గంటలపాటు సురక్షితంగా క్యాప్యూల్స్లోకి వెళ్లి తలదాచుకోమని నాసా హెచ్చరించాల్సి వచ్చింది. రష్యా చర్యను తీవ్రంగా ఖండించింది కూడా. గతంలో అమెరికా, చైనా, భారత్‌లు కూడా ఇలాగే భూకక్ష్యలోని తమ పాత ఉపగ్రహాలను పేల్చేశాయి. ఎంత చెత్త ఉంది... భూమి దిగువ కక్ష్యలో దాదాపు 9,600 టన్నుల చెత్త (విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, నట్లు, బోల్టులు తదితరాలు) పేరుకుపోయిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) అంచనా. సాఫ్ట్ బాల్ సైజులో ఉన్న భాగాలు 23 వేలు ఉంటాయని నాసా లెక్క. సెంటీమీటరు పరిమాణంలో ఉండేవి ఐదు లక్షల పైచిలుకే ఉంటాయి. ఇవి గంటకు ఏకంగా 25,265 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తుంటాయి. ఈ శకలాలు ఒకరోజులో భూమి చుట్టూ 15 నుంచి 16 సార్లు పరిభ్రమిస్తాయి. ఈ వేగంతో వెళుతున్నపుడు ఎంత చిన్నశకలమైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొడితే కలిగే నష్టాన్ని ఊహించగలమా? విస్పోటం లాంటిది సంభవించే అవకాశం ఉంటుంది. శాటిలైట్లను తాకితే అవి తునాతునకలైపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా భూమికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తుల్లో కక్ష్యలో సమాచార, పరిశోధక ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. వీటికి ఈ మానవ జనిత చెత్త, శకలాల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మునుముందు శాటిలైట్ ప్రయోగాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి... చెత్త పేరుకుపోయే... ముప్పు మరింత పెరుగుతుంది. భూకక్ష్యను దాటివెళ్లే అంతరిక్ష ప్రయాణాలకు వీటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. భూమి కక్ష్యలో 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే చెత్త క్రమేపీ కొన్నేళ్లలో కిందికి దిగజారుతూ భూమిపైకి పడిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చెబుతోంది. కాకపోతే వెయ్యి కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించే శకలాలే 100 ఏళ్లు.. ఇంకా అంతకుపైనే తిరుగుతూ ఉంటాయట. వీటితోనే ముప్పు. పైగా భవిష్యత్తులో ఇలాంటి శకలాల నుంచి ముప్పు తప్పించుకునే సాంకేతికతలను శాటిలైట్లకు జోడించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం 5 నుంచి 10 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తానికి భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ మానవ జనిత చెత్తతో మనకు చిక్కొచ్చిపడుతోంది! – నేషనల్ డెస్క్, సాక్షి -
వెలికితీతే.. శాపమైంది !
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అత్యంత అరుదైన గార (డంగుసున్నంతో రూపొందిన) శిల్పం ఇప్పుడు వాతావరణ ప్రభావానికి గురై ముక్కలు ముక్కలుగా విడిపోయి శిథిలమవుతోంది... వందల ఏళ్లుగా భూగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ ప్రతిమ, తవ్వకాల్లో వెలుగు చూశాక ఇప్పుడు రూపు కోల్పోతోంది. దాదాపు 6 అడుగుల పొడ వున్న ఈ బోధిసత్వుడి విగ్రహం ఇక్ష్వాకుల కాలంలో క్రీ.శ. మూడో శతాబ్దంలో రూపొందినట్టుగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్థూప కేంద్రమైన ఫణిగిరిలో గత ఏప్రిల్‌లో ఇది బయటపడింది. అప్పటికే పగుళ్లు ఏర్పడి కొంతభాగం ముక్కలైన ఈ శిల్పాన్ని తవ్వకాల సమయంలో అధికారులు సురక్షితంగా వెలికి తీసి నగరంలో ఉన్న పురావస్తుశాఖ డైరెక్టరేట్‌కు తరలించారు. ఇది డంగు సున్నంతో రూపొందిన విగ్రహం కావటం, తయారై దాదాపు 1700 సంవత్సరాలు కావస్తుండటంతో దానికి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాలం కావటంతో గాలిలో అధికంగా ఉండే తేమను పీల్చుకుని అది వేగంగా శిథిలమవుతోంది. మరికొంతకాలం ఇలాగే ఉంటే అది ముక్కలుముక్కలై అనవాళ్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈలోపే దాన్ని సంరక్షించి తేమ చొరబడకుండా గాజు పెట్టెలో భద్రపరచాల్సి ఉంది. నిపుణులు సిద్ధంగా ఉన్నా... దాదాపు 1700 ఏళ్లక్రితం ఆ విగ్రహం రూపొందిందని స్థల చరిత్ర ఆధారంగా అధికారులు అప్పట్లో గుర్తించారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రం కావటంతో ఈ ప్రతిమ కూడా బుద్ధుడిదే అయి ఉంటుందని భావించారు. కానీ విగ్రహంపైన ఆభరణాల గుర్తులున్నాయి. దీంతో అది ఓ రాజుదిగా తేల్చారు. బుద్ధుడి జాతక కథల్లో ఉండే బోధిసత్వుడుదిగా తేల్చారు. గతంలో బోధిసత్వుడికి సంబంధించి రెండు మూడు అడుగుల ఎత్తున్న గార ప్రతిమలు వెలుగు చూశాయి. కానీ 6 అడుగులకంటే ఎత్తున్న సున్నం విగ్రహం ఇప్పటివరకు ఎక్కడా బయటపడలేదు. విగ్రహంపై అలంకరణకు సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి, ఒక చేయి, కొంతభాగం కాళ్లు ఉన్నాయి. ఆ ఆకృతి ఆధారంగా విగ్రహానికి పూర్తి రూపు ఇవ్వగలిగే నిపుణులు ఢిల్లీ, ముంబై, పుణేల్లో ఉన్నారు. కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలో కూడా ఇలాంటి నిపుణులున్నారు. వారిని పిలిపిస్తే విగ్రహంపై ప్రస్తుతానికి మిగిలిన ఆనవాళ్ల ఆధారంగా అదే డంగు సున్నం మిశ్రమంతో దాని పూర్వపు రూపాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో దాన్ని గాలి చొరబడని గాజు పెట్టెలో భద్రపరిస్తే భావితరాలకు అందించే వీలుంటుంది. కానీ ఆ కసరత్తు లేకుండా పురావస్తుశాఖ విగ్రహాన్ని గాలికొదిలేసింది. ఇలా నెలల తరబడి నిర్లక్ష్యం కారణంగా సున్నపు విగ్రహం తేమను పీల్చుకుంటూ శిథిలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అరుదైన విగ్రహా లు ధ్వంసమైతే భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని అంటున్నారు. -
55 ఏళ్ల కిందట కూలిన విమాన శకలాలు గుర్తింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐదు దశాబ్దాల కిందట సముద్రంలో కూలిపోయిన కోస్ట్‌గార్డ్ యుద్ధవిమాన శకలాలను ఎట్టకేలకు ఇటీవల గుర్తించారు. స్కూబా డైవర్లు పదేళ్లగా చేసిన కృషి ఫలించింది. చెన్నై సమీపంలోని నీలాంగరై వద్ద సముద్రంలో విమానశకలాలను కనుగొన్నారు. 1964 ఆగస్టు 13న చెన్నై కోస్ట్‌గార్డ్‌కు చెందిన చిన్న విమానం చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరి నీలాంగరై సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. అధికారులకు తెలియకుండా ఒక మెకానిక్ ఆ విమానాన్ని నడుపుతూ నేలపైకి దించడం చేతకాక, అదుపుచేయలేక పోవడంతో అది సముద్రంలో కూలిపోయింది. ఆ విమానాన్ని నడిపిన మెకానిక్‌ను సమీపంలోని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన వివిధ ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లినపుడు వారి వలలు దేనికో చిక్కుకుని తెగిపోవడాన్ని గమనించారు. ఖరీదైన వలలు తరచు తెగిపోతూ నష్టపోతున్నామని మత్స్యశాఖ అధికారులకు చెప్పుకొని వాపోయారు. వలలు తెగిపోవడానికి కారణాలు అన్వేషించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. పుదుచ్చేరిలోని స్కూబా డైవింగ్ శిక్షకుడు అరవింద్ తరుణ్‌శ్రీ నేతృత్వంలో నీలాంగరై మత్స్యకార ప్రాంతానికి చెందిన సద్గురు, మరో ముగ్గురితో కూడిన బృందం కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం కోసం పదేళ్లుగా గాలిస్తోంది. ఈనెల 17న నలుగురు స్కూబా డైవర్లు, కొన్ని ఉపకరణాలు, చేపలు పట్టే 30 మరపడవలతో బయలుదేరారు. చెన్నై సమీపంలోని నీలాంగరై వద్ద తీరం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగుభాగంలో తనిఖీలు చేపట్టారు. సముద్రంలో 12 అడుగుల లోతున పాచిపట్టిన విమాన శకలాలను గుర్తించారు. ఈ విషయాన్ని కోస్ట్‌గార్డ్, విమానయానశాఖలకు తెలిపారు. -
మట్టితినడమే పనిగా...
మట్టి వాసనను ఇష్ట పడని మనుషులుండరు. చిన్న తనంలో చాలామందికి మట్టి, చాక్ పీస్ లు వంటివి తిన్న అనుభవాలూ ఉంటాయి. కొందరు గర్భిణిలకు కొన్ని వాసనలు పడకపోవడంతోపాటు, కొన్ని వస్తువులను పదే పదే తినాలన్న కోరిక కూడ కలుగుతుంటుంది. అయితే అవి గర్భంలోని పిల్లలకు ఎటువంటి హాని కలిగించనివి అయితే ఫర్వాలేదు. కానీ ఓ మహిళ ఏకంగా మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పటినుంచీ ఇటుక పొడిని, మట్టిని తినడం పనిగా పెట్టుకొందట. మట్టి తినేందుకు, ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు అనేక అబద్ధాలు కూడ చెప్తుండేదట. లివర్‌పూల్ కు చెందిన చెందిన 30 ఏళ్ళ జెన్నీ మాసన్.. మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు ఇటుకపొడి, ఇసుక, మట్టి వంటి పదార్థాలను ఎవ్వరికీ తెలియకుండా తినేసేదట. ఇంట్లోని గోడల్లో ఉండే ఇటుకల పొడి, గార్డెన్ లోని మట్టిలను అందరి కళ్ళూగప్పి సేకరించుకొని, ఆహార పదార్థాలతోపాటు.. ఎంతో ఇష్టంగా తినేదట. అయితే అటువంటి పదార్థాలను తినాలన్న అలవాటు... ఆమెలో చివరికి 'పికాగా' నిర్థారణ అయ్యిందట. రైలీ కొన్నోర్ గర్భంలో పడినప్పుడు అలవాటుగా మారిన మట్టి తినే సమస్య... ఆమెకు అతడు పుట్టిన మూడు నెలల తర్వాత తీరిందట. ఓ టీవీ కార్యక్రమంలో మట్టి తినడంవల్ల కలిగే నష్టాలను వివరించినా ఆమె మానుకోలేక పోయిందట. అంతకు ముందు పికా గురించి తాను ఎప్పుడూ వినలేదని, అటువంటి సమస్య ఉంటుందని తనకు తెలియదని జెన్నీమాసన్ చెప్తోంది. పికా అనేది శరీరంలో రక్త హీనత, పోషక లోపాల వల్ల సంభవించే రుగ్మత అని, అది మట్టి, ఇసుక, ఇటుకపొడి వంటివి తినే కోరిక కలిగేట్లుగా చేస్తుందని తెలుసుకొన్న జెన్నీ తర్వాత... వాటి జోలికి పోలేదు. గర్భధారణ సమయంలో ఇటువంటి లోపాలు సంభవించడం సాధారణమేనని, అయితే సమస్యను వెంటనే వైద్యులకు వివరించి తగిన జాగ్రత్తలు, వైద్యం తీసుకోకుంటే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని తెలుసుకొంది. పోషక విలువలు కలిగిన పదార్థాలను సేవించడం మానుకొని, పనికిరాని మట్టిని తినడం నష్టాన్ని కలుగజేస్తుందని తెలుసుకొంది. ఇసుక మట్టి దంతాలకు కూడ తీవ్ర నష్టాన్నికలిగిస్తాయని వైద్యుల ద్వారా తెలుసుకొంది. అయితే ప్రసవం వరకూ కూడ ఎవరు ఎన్ని చెప్పినా అలవాటును మానలేకపోయింది. చివరకు బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఆమెలో మట్టి తినాలన్న కోరిక దూరమైంది. ప్రస్తుతం మూడేళ్ళ తన కొడుకు రైలీ కొన్నోర్ ను చూసినప్పుడల్లా ఎంతో భయం వేస్తుందని, అదృష్టం కొద్దీ బిడ్డకు ఎటువంటి అవకరాలు రాకపోయినా, తదుపని బిడ్డల విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆలోచనతో మట్టి తినడం మానుకున్నాని జెన్నీ చెప్తోంది. తనకు వచ్చిన సమస్య ఇంకెవరికైనా వస్తే వెంటనే వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకొని, కడుపులోని బిడ్డల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది. -
సముద్రంలో 122 ‘విమాన శకలాలు’
ఫ్రాన్స్ శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు కౌలాలంపూర్/పెర్త్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీ తెలుసుకోవడానికి అత్యంత విశ్వసనీయ ఆధారాలు దొరికాయి. దీని శకలాలుగా భావిస్తున్న 122 వస్తువులు దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపించాయి. ఫ్రాన్స్ ఉపగ్రహం వీటిని ఆదివారం గుర్తించి ఫొటోలు తీసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 2,557 కి.మీ దూరంలో వీటి ని గుర్తించినట్లు మలేసియా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. ‘400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 122 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక మీటరు నుంచి 23 మీటర్ల సైజులో ఉంది. కొన్ని ప్రకాశవంతంగా కనిపిస్తుడడంతో అవి దృఢపదార్థాలతో తయారై ఉండొచ్చని భావిస్తున్నాం. ఇవి ఇదివరకు చైనా, ఆస్ట్రేలియాలు.. శకలాలుగా భావిస్తున్న వస్తువులను గుర్తించిన చోటికి సమీపంలోనే ఉన్నాయి. ఇవి బోయింగ్వని భావించొచ్చు. కానీ కచ్చితంగా చెప్పలేం. నిర్ధారణ అయ్యాక తర్వాతి దశ గాలింపు మొదలుపెడతాం’ అని అన్నారు. మరోపక్క.. శకలాల కోసం గాలిస్తున్న విమానాలకు నీలిరంగు వస్తువు సహా మూడు వస్తువులు కనిపించాయి. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఈ నెల 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం, అది దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని మలేసియా ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కాగా, మలేసియా ఎయిర్‌లైన్స్, బోయింగ్ కంపెనీలు కోట్లాది డాలర్ల పరిహారంతో ముడిపడిన దావాలో చిక్కుకున్నాయి. ఈ విమానం డిజైన్, కూలిపోయేందుకు దారి తీసిన లోపాల వివరాలివ్వాలని షికాగోలోని ఒక లా సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది.


