
ఉత్తరాది రాష్ట్రం పంజాబ్‌ను భారీ వరదులు ముంచెత్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 29 మంది మరణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాననీటిలో మునిగిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల 2.65 లక్షలకు పైగా నివాసితులు ప్రభావితమయ్యారు.
అంతేకాకుండా పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ వరదలు వల్ల పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, కపుర్తలా, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్ అమృత్‌సర్‌తో సహా 12 జిల్లాలు అతలకుతలమయ్యాయి.
ఆగస్టు నెలలో రాష్ట్రంలో 250 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 25 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తీవ్రమైన విఫత్తుపై పంజాబ్ లోకల్ బాయ్, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.
"వరదలతో అతలాకుతలం నా పంజాబ్ చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. పంజాబ్ ఎన్ని కష్టాల్లు వచ్చినా ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మేము ఈ స్థితి నుంచి మళ్లీ పైకి వస్తాం. బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను.
ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని గిల్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా శుబ్‌మన్ ఆసియాకప్ కప్-2025 కోసం సిద్దమవుతున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించనున్నాడు.
చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగరికి ఐపీఎల్‌లో భారీ ధర!