కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి, ఆరుగురు పరిస్థితి విషమం | 14 People Dead In Amritsar After Consuming Spurious Liquor, Watch Videos For More Details | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి, ఆరుగురు పరిస్థితి విషమం

May 13 2025 10:09 AM | Updated on May 13 2025 11:05 AM

14 People Dead In Amritsar After Consuming Spurious Liquor

ఛండీఘడ్‌: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌ సర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా మారింది.  


దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ‘సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది. సమాచారంతో బాధితుల్ని అస్పత్రికి తరలించాం. వారిలో 14 మంది మరణించారు’ అని అమృత్‌సర్ ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు.  

అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ..నిన్న రాత్రి మద్యం సేవించిన ఐదు గ్రామాలకు చెందిన ప్రజల పరిస్థితి విషమంగా ఉందని మాకు సమాచారం అందించింది. వెంటనే సంబంధిత గ్రామాలకు వైద్య బృందాల్ని పంపించాం. ఇప్పటికీ వారికి రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం. నకిలీ మద్యం సేవించి ఇప్పటివరకు 14 మంది మరణించారు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తోంది. ఈ మరణాల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. నకిలీ మద్యాన్ని పంపిణీ చేసిన వ్యాపారస్థుల్ని అదుపులోకి తీసుకున్నాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement