చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలోని కేఎస్ ఆర్టీసీ బస్టాండు ఏపీ– కర్ణాటక రాష్ట్రాల మధ్య వారధిలా ఉంటూ నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది. దీనినే దొంగలు అనువుగా మార్చుకున్నారు. విలువైన మొబైల్ పోన్లు, బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. పేరేసంద్రకు చెందిన కేశవ అనే ప్రయాణికుడు బెంగళూరుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు, బస్సు జనంతో కిటకిటలాడుతోంది. జేబులో ఉన్న ఫోన్ పోతుందేమో అనే భయంతో తీసుకుని, పక్కనున్న వ్యక్తికి పట్టుకోమని ఇచ్చాడు. క్షణాల్లోనే ఆ అపరిచితుడు మాయం కావడంతో బాధితుడు కంగుతిన్నాడు. అలాగే.. చిక్కవాసి అభిలాష్ గౌరిబిదనూరుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు, ముదుగానకుంటె గ్రామంలోని గంగమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ రద్దీలో అభిలాష్ ఐఫోన్‌ను దొంగలు కొట్టేశారు. కొంతసేపటికి గమనించి, ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించి ఓ దొంగను పట్టుకొన్నారు, మరొకరు పరారయ్యాడు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు, అందులోనూ బాలలని తేలింది. మైనర్లను ఉపయోగించి మొబైల్ దొంగల ముఠాలు ఈ దందాను నడిపిస్తున్నట్లు అనుమానాలున్నాయి. మరికొందరి మొబైళ్లు కూడా చిక్క బస్టాండులోనే చోరీ అయ్యాయి.
ప్రయాణికులకు భయం భయం


