బెళగావి టు హైదరాబాద్‌.. కొత్త రైలు బండ్లు | - | Sakshi
Sakshi News home page

బెళగావి టు హైదరాబాద్‌.. కొత్త రైలు బండ్లు

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

గుంతకల్లు/ శివాజీనగర: కర్ణాటకలోని బెళగావి నుంచి గుంతకల్లు మీదుగా తెలంగాణలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చర్లపల్లి జంక్షన్‌లకు కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. దీని వల్ల వేలాది మంది ప్రయాణికులకు ఉపయుక్తం అవుతుంది.

హైదరాబాద్‌– బెళగావి మధ్య..

● గతంలో రద్దయిన హైదరాబాద్‌–బెళగావి ఎక్స్‌ప్రెస్‌ రైలు (17071) ను పునురుద్ధరించారు. ఈ నెల 15 నుంచి మొదలవుతుంది. ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బెళగావికి చేరుకుంటుంది.

●బెళగావి–హైదరాబాద్‌ (17072) రైలు మే 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు బెళగావి నుంచి బయలుదేరి, శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.

సికింద్రాబాద్‌ టు బెళగావి

● అలాగే సికింద్రాబాద్‌ నుంచి బెళగావి మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి ఈ నెల 18 నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి (17073) మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు బెళగావికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెళగావి నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరే రైలు (17074) మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.

చర్లపల్లి– బెళగావి సర్వీసులు

● చర్లపల్లి–బెళగావి–చర్లపల్లి మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 16 నుంచి సంచరిస్తుంది. చర్లపల్లి జంక్షన్‌ నుంచి శనివారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరే రైలు (17075) మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు బెళగావికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెళగావి నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరే రైలు (17076) మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు చర్లపల్లికి చేరుతుంది.

● బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, తాండారు, యాదగిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, దరోజి, తోర్నగల్లు, హోస్పేట్‌, కొప్పల్‌, గదగ్‌, హుబ్లీ, ధార్వాడ్‌, లోండా, ఖానాపుర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

నేటి నుంచి వరుసగా సర్వీసులు షురూ

ప్రయాణికులకు సౌలభ్యం

Advertisement
 
Advertisement
Advertisement