అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

బళ్లారి టౌన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో షోటోఖాన్‌ అకాడమీ విద్యార్థులు సత్తా చాటినట్లు ఆ అకాడమీ అధ్యక్షుడు కట్టెస్వామి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థులను శిక్షకులు ఉలిగన్న, ప్రసాద్‌, జడేషా, సుభాష్‌ మోత్కార్‌ అభినందించారు.

యువకుడు దారుణ హత్య

రాయచూరు రూరల్‌: కలబుర్గి జిల్లా చిత్తాపూర్‌ తాలుకా బి.అల్లూరిలో ఓ యువకుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దప్ప మళ్లప్ప హుళగోళర్‌ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

అక్రమ కట్టడాలు

తొలగించండి

రాయచూరు రూరల్‌: నగరంలోని బసవేశ్వర సర్కిల్‌ వద్ద ఉన్న విగ్రహం కనబడకుండా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని అఖిల భారత వీరశైవ మహసభ, వీరశైవ సమాజ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగర సభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకులు శరణ భూపాల్‌, నాడగౌడ మాట్లాడుతూ.. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నగర సభ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, పరమేశ్వర్‌, కల్లయ్య, దానమ్మ, విజయరాజ్‌, రామన గౌడ తదితరులు పాల్గొన్నారు.

నూతన బీఈఓ

బాధ్యతల స్వీకరణ

హొసపేటె: తాలూకా విద్యాశాఖ అధికారిగా (బీఈఓ) బి.ఉమాపతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హగరిబొమ్మనహళ్లి తాలూకా వల్లభాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని తొలగించి రాష్ట్రంలో మంచి స్థానం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యా పురోగతికి సహకరించాలని ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేశారు. అంతకుమందు ఇన్‌చార్జ్‌గా ఉన్న శేఖర్‌ హొరపేటను కొప్పళ బీఈఓగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, తాలూకా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కొత్త బీఈఓ బి.ఉమాపతిని అభినందించి సన్మానించారు.

క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు

రాయచూరు రూరల్‌: క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పోలీస్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పిల్లలకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ప్రతిభా పురస్కారాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి అభ్యున్నతికి పాటు పడాలన్నారు. సమాజంలో బడుగు వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాలని సూచించారు. విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హరీష్‌, డీఎస్పీ శాంతవీర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement