హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీ చుట్టు పక్కల ఉన్న కమలాపుర ప్రాంతంలో అక్రమంగా వెలిసిన హోంస్టేలు, రెస్టారెంట్లపై పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సోమవారం ఉక్కుపాదం మోపాయి. అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా హంపీ ప్రాంతంలో వందలాది హోంస్టేలు, రెస్టారెంట్లు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హంపీ, కమలాపుర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోంస్టేలు పర్యాటకులకు సేవలు అందించడానికి అవసరమైన అధికారిక అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు తెలిసింది. సంయుక్త ఆపరేషన్‌లో జిల్లా ఎస్పీ జాహ్నవి, తహసీల్దార్ శృతి, పర్యాటక శాఖ సీనియర్ అధికారుల బృందం పాల్గొన్నారు.


