గంగమ్మ ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ ఆలయ వార్షికోత్సవం

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

మాలూరు: తాలూకాలోని పుర గ్రామంలో గంగమ్మ దేవి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇటీవల దేవాలయాన్ని జీర్ణోద్దారణ చేయగా.. జీర్ణోద్దారణ అనంతరం మొదటి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గోపూజ, స్వస్తివచనం, అంకురార్పణ, మహాగణపతి పూజ, అగ్నిప్రతిష్ట, గణహోమం, పంచామృతాభిషేకం చేశారు. అంచెముస్కూరు, లక్కూరు. చిక్కతిరుపతి, జయమంగల, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.

వైభవంగా

చౌడేశ్వరి దేవి దీపారాధన

కోలారు: బంగారుపేట తాలూకా బేతమంగల ఫిర్కా కంగాండ్లహళ్లి గ్రామంలో చౌడేశ్వరి దేవి జాతరలో భాగంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు దేవాలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉదయం దేవాలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం, దీపారాధన, తదితర పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement