రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నకిలీ రూ.500 నోట్ల చెలామణి అధికమైంది. గత వారం రోజుల నుంచి వివిధ దుకాణాలు, అంగళ్లు, హోటళ్లలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఏడాది క్రితం సిరవారలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా కొనసాగింది. మార్కెట్‌లోకి నకిలీ రూ.500 నోట్లు రావడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్లపై నంబర్, స్టిక్కర్, మహాత్మ గాంధీ చిత్రం, న్యూ ఢిల్లీ కోట చిత్రం మాదిరిగానే ఉంటుందనే భావనలో ప్రజలున్నారు. ఈ సందర్భగా గత రాత్రి సిరవార తాలూకా కల్లూరు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించడానికి వచ్చిన ఇద్దరు యువకులు రూ.120 పెట్రోల్ వేయించుకొని రూ.100 నకిలీ కరెన్సీ నోట్లను ఇచ్చారు. అనుమానంతో యజమానికి విషయాన్ని చేరవేశారు. 112కు ఫోన్ చేసి నగరంలోని ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన యూసఫ్ మహ్మద్, బందేనవాజ్ నివాసి ముర్తుజాలను పోలీసులకు అప్పగించారు. సిరవార ఎస్‌ఐ చంద్రశేఖర్ హిరేమఠ్ వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


