అవాంఛిత పిల్లలను అనాథల్ని చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

అవాంఛిత పిల్లలను అనాథల్ని చేయొద్దు

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

హొసపేటె: పిల్లలు ఈ దేశపు ఆస్తి. అనాథ లేదా అవాంఛిత పిల్లలను ఎక్కడపడితే అక్కడ వదిలి వేయకుండా వారిని ఒక ప్రత్యేక ప్రభుత్వ దత్తత సంస్థకు అప్పగించి, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో సహాయపడాలని జిల్లాధికారిణి కవిత ఎస్‌.మన్నికేరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నగరంలోని ప్రత్యేక దత్తత సంస్థను సందర్శించి, తనిఖీ చేసి, ఇద్దరు పిల్లల దత్తత ఉత్తర్వు జారీ చేసిన అనంతరం మాట్లాడారు. 2024 అక్టోబర్‌లో జిల్లాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 7 మంది పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుని వారి జీవితాలను ప్రకాశవంతం చేసిందన్నారు. జైలు మార్గదర్శకాల ప్రకారం మండ్య, హొన్నావరలకు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలను దత్తతకు అప్పగించి, ఆ సంస్థలోనే పిల్లల సంరక్షణ, పెంపకాన్ని సక్రమంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. వదిలి వేసిన లేదా అనాథ పిల్లలు కనపడితే మహిళా శిశు అభివృద్ధి శాఖ పరిధిలోని జిల్లా బాలల సంరక్షణ విభాగాన్ని వెంటనే సంప్రదించి తెలియజేయాలన్నారు. ఆ పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుని వారికి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వండి అని ఆమె సూచించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సుదీప్‌ కుమార్‌ ఉంకి, జిల్లా బాలల సంరక్షణ విభాగం, దత్తత కేంద్రం సిబ్బంది, తల్లిదండ్రులు హాజరయ్యారు.

వారిని ఏదైనా దత్తత సంస్థకు అప్పగించండి

విజయనగర జిల్లా మేజిస్ట్రేట్‌

కవిత ఎస్‌ మన్నికేరి విజ్ఞప్తి

Advertisement
 
Advertisement
Advertisement