శివాజీనగర: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన తేదీ జూన్ 20 నుంచి శిక్షణ, ముద్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 30 నుంచి జూలై 29 వరకు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారు. ఓటరు జాబితాలో చేరేందుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అక్టోబర్ 7న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి అనూప్ కుమార్ వెల్లడించారు. ఆయన శుక్రవారం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 86 శాతం ప్రగతి సాధించారన్నారు. కొడగు జిల్లాలో 96 శాతం పూర్తయిందన్నారు. చిత్తాపుర అసెంబ్లీ నియోజకవర్గంలో మ్యాపింగ్ ప్రగతి పరిశీలనకు ముందు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో అతి ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించినట్లు తెలిపారు.
ఓటరు గణన, క్యూఆర్ కోడ్
ఎన్నికల ప్రక్రియ ముందు దశల గురించి ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ఫారంలో గణన నమూనానే అత్యంత ముఖ్యం అన్నారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి 2 సెట్ల గణన నమూనాలను చేస్తారన్నారు. ప్రత్యేకత అంటే గణతి నమూనాలో ఉన్న ప్రతి ఓటరుకు కూడా ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు.
ఒక సెట్ తిరిగివ్వాలి
బూత్ స్థాయి అధికారులు గణన నమూనాను ఇంటికి తెచ్చినపుడు ప్రజలు అందులో 1 సెట్‌ను పూర్తిగా భర్తీ చేసి అధికారులకు తిరిగి ఇవ్వాలి. మరో సెట్ గణన నమూనాను భవిష్యత్‌కు సాక్షిగా ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు సమాచారం అందించే సమావేశం నిర్వహించామన్నారు. రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించవచ్చు. మాధ్యమాలకు సైతం శిక్షణ శిబిరాన్ని జరుపుతామన్నారు. జీపీ స్థాయిలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను తెరుస్తారన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలు
రాష్ట ఎన్నికల అధికారి అనూప్‌కుమార్


