రాయచూరు రూరల్: విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు ప్రతిభా పాటవాలు అవసరమని సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి అభిప్రాయ పడ్డారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో అంజుమన్ ఈ సంస్థలో ప్రతిభాన్విత విద్యార్థులను సత్కరించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ తత్వ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుని జ్ఞానంతో విద్యాభ్యాసం సాధించాలని పోతే జీవితాలకు అపాయం కలుగుతుందన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఉందన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, సంస్థ సంచాలకులు హ్యారిస్ సిద్దికి, రజాక్ ఉస్తాద్, అబ్దుల్ ఖరీం, అస్లాం పాషా, లతీఫ్, తారీఖ్ హుసేన్, అమినుల్ హసన్, మహిబూబ్, బందే నవాజ్, జుబేర తదితరులు పాల్గొన్నారు.


