రాయచూరు రూరల్: జపాన్ మామిడి పండ్లకు కొప్పళ జిల్లాలో డిమాండ్ పెరిగింది. కొప్పళ జిల్లాలోని కల్లతావర గెరెలో రైతు నాగరాజ్ రెండు ఎకరాల్లో మియా జాకీ అనే రకం మామిడి పండ్లను పండించారు. జపాన్ నుంచి మియా జాకీ రకం మామిడిని కొనుగోలు చేసి పంట పండించారు. జపాన్ నుంచి తెచ్చిన కొత్త రకం మామిడి పండ్లకు భలే డిమాండ్ ఏర్పడింది. ఐదు రోజుల పాటు మామిడి పండ్ల శిబిరాన్ని ప్రజలు తిలకించడానికి వీలు కల్పించినట్లు నాగరాజ్ తెలిపారు. జపాన్ మామిడి పండ్లు యాపిల్ పండ్ల మాదిరిగా ఉంటాయి. 10వ వార్షికోత్సవంలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఆరోగ్యంపై కనీస
జాగ్రత్తలు అవసరం
రాయచూరు రూరల్: నగరంలో విధులు నిర్వహించే పౌర కార్మికులు ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు వహించాలని సఫాయి కర్మచారి మండలి అధ్యక్షుడు మురళి అశోక్ సాలప్ప పిలుపునిచ్చారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో పౌర కార్మికులకు రూ.5 లక్షలు నగదు రూపేణ బీమా పాలసీలను అందించిన అనంతరం పౌర కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి 5,744 మంది కార్మికులకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేశామన్నారు. ఆరోగ్యం విషయంలో కార్మికులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఐపీడీ సాలప్ప నివేదిక ఆధారంగా 36 అంశాలతో కూడిన ఆరోగ్య కార్డుల ద్వారా లబ్ధి పొందాలన్నారు. మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పౌర కార్మికుల పిల్లలకు విద్యార్థి వేతనాలను చెల్లించాలని కోరారు. జిల్లాధికారిణి పూవిత, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, శరణప్ప, కృష్ణ, రవి, మల్లికార్జున, జయపాల్ రెడ్డిలున్నారు.
జూలై 27న దక్షిణాది
రాష్ట్రాల సమావేశం
రాయచూరు రూరల్: నగరంలో జూలై 27న దక్షిణాది రాష్ట్రాల సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి కాపు, బలిజ కులాలకు చెందిన సభ్యులు సమావేశంలో పాల్గొంటారన్నారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవంతో పాటు పంచ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారన్నారు.


