లారీ యజమానుల సంఘానికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

లారీ యజమానుల సంఘానికి ఎంపిక

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

బళ్లారిఅర్బన్‌: జిల్లా లారీ యజమానుల సంఘం నూతన అధ్యక్షుడిగా చల్లా మహేష్‌ను ఎంపిక చేసినట్లు మాజీ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ మించు శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం స్థానిక లారీ టర్మినల్‌లోని లారీ యజమానుల సంఘం కార్యాలయంలో సభ్యుల సమక్షంలో సంఘం పదాధికారులను ఎంపిక చేశామన్నారు. లారీ యజమానుల సంఘం అభివృద్ధికి గత రెండేళ్లుగా కృషి చేశానన్నారు. నూతన అధ్యక్షుడు చల్లా మహేష్‌ మాట్లాడుతూ లారీ యజమానుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి పని చేస్తానన్నారు. సభ్యులందరూ ఐక్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా లారీ యజమానుల సంఘం గౌరవ అధ్యక్షుడుగా మున్నాబాయి, జిల్లా అధ్యక్షులుగా చల్లా మహేష్‌, ఉపాధ్యక్షులుగా వై.శ్రీనివాసులు, హెచ్‌.నారాయణ స్వామి, ప్రధాన కార్యదర్శిగా వీ.శ్రీనివాసులు, కార్యదర్శిగా చల్లా రమేష్‌, కోశాధికారిగా జి.లక్ష్మీనారాయణ, సలహాదారుడుగా బి.పాండురంగ తదితర పదాధికారులను ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ నాయకులు బోయపాటి విష్ణు, వెంకటేష్‌ హెగ్డే, ఎస్‌ఆర్‌పీ కాలనీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement