కోలారు: సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసన్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా జాగృతి సమితి ఏర్పాటుకు సిఫార్సు చేశారని, సాంఘిక సంక్షేమ శాఖ జేడీగా ఆయన నియామకాన్ని రద్దు చేయాలని దళిత సంఘటనల సంయుక్త రంగ పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎమ్మెల్సీ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘటన అధ్యక్షుడు డీపీఎస్ మునిరాజు మాట్లాడుతూ జాగృతి సమితి ఎంపికకు తొలుత అర్జీలు ఆహ్వానించి అన్ని దళిత సంఘటనలు, సముదాయ సేవకులకు అవకాశం కల్పించాల్సి ఉండగా సదరు అధికారి ఆ నిబంధనలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. వెంటనే ఈ సమితిని రద్దు చేసి కొత్తగా సమితిని రచించాలని కోరారు. నారాయణస్వామి, గాంధీనగర చేతన్ బాబు, మోజిపాళ్య నాగేష్ తదితరులు ఉన్నారు.


