ఫ్రీడం పార్క్‌లో యోగా శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఫ్రీడం పార్క్‌లో యోగా శిబిరం

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

హొసపేటె: రోజూ ధాన్యం, యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగా సమితి గదగ్‌, విజయనగర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ డాక్టర్‌.ఎస్‌బి.హండ్రాల్‌ తెలిపారు. ఆదివారం ఉదయం ఫ్రీడం పార్క్‌లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. కపాలభాతి, అపాన ముద్ర, సూర్య ముద్ర అనే మూడు ముద్రలతో సాధన చేయడం మన జీర్ణాశయ సమస్యలకు కూడా ఒక దివ్యౌషధంలా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగా సమితి జిల్లా ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఎఫ్‌టి.హళ్లికేరి, బళ్లారి జిల్లా ఇన్‌చార్జి రాజేష్‌ కర్వ, సత్యప్ప, విఠోబా బళ్లూరు. ద్రాక్షాయిణి శివకుమార్‌, కవితా ఆనంద్‌, శ్రీధర్‌, ప్రకాష్‌ కులకర్ణి, శివమూర్తి, శ్రీధర్‌, ప్రకాష్‌ కులకర్ణి, శివమూర్తి, శ్రీధర్‌ వెంకటేష్‌ వాసి, అశోక చిత్ర, శ్రీరామ్‌, చంద్రిక, శైలజ కలకప్ప, రామచంద్ర పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement