● పోలీసు అధికారుల తనిఖీ
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సంచరించే మార్గంలో బెంగళూరు దక్షిణ తాలూకా వడేరహళ్ళి గేట్ వద్ద విస్ఫోటక పదార్థాలైన జిలెటిన్ కడ్డీలు లభించడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వారంరోజుల నుంచి ప్రధాని టూర్‌కు ఎస్‌పీజీ, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తీరా మోదీ వచ్చిన సమయంలో పేలుడు పదార్థాలు బయటపడడం చర్చనీయాంశమైంది. వడేరహళ్ళి గేట్ సమీపంలోని రోడ్డు పక్కన రెండు జిలెటిన్ కడ్డీలు లభ్యమయ్యాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో లభించాయి. పేలుడు వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయి? దీని వెనుక ఏమైనా కుట్ర వంటిది ఉందా అనేది కనుగొనేందుకు ఇన్స్‌పెక్టర్‌తో పాటుగా 50 మంది పోలీసులతో తనిఖీ బృందాన్ని రామనగర ఎస్పీ నియమించారు. పోలీస్ ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో శోధించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరిస్తున్నారు.
బెంగళూరు ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ కన్నుమూత
గవర్నర్, సీఎం, డీసీఎంల నివాళులు
నేడు చెళ్లకెరెలో అంత్యక్రియలు


