సహజీవనంలో దారుణం | - | Sakshi
Sakshi News home page

సహజీవనంలో దారుణం

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

బనశంకరి: సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్‌లో పనిచేస్తూ ఇన్‌స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

మహిళ వేధింపులకు యువకుడు బలి

Advertisement
 
Advertisement
Advertisement