పిల్లలకు ఈత.. గుండెకోత | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు ఈత.. గుండెకోత

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

మాలూరు: పిల్లలకు ఈత నేర్పాలనే ఓ తండ్రి తపన విధి విలాసం ముందు ఓడిపోయింది. పిల్లలు, తండ్రీ నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని నక్కనళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు శ్రీనివాస్‌ (40), కుమారులు చేతన్‌ (13), రాజేష్‌ (8)ను తీసుకుని ఈత నేర్పించడం కోసం ఓ రైతుకు చెందిన పొలంలోని నీటి కుంటకు వెళ్లాడు. పిల్లలు పట్టుతప్పి నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడేందుకు వెళ్లిన శ్రీనివాస్‌ కూడా నీటిలో మునిగిపోయాడు. దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారు కరువయ్యారు. ఎంతసేపటికీ ఇంటికి రాలేదని అతని భార్య, స్థానికులతో కలిసి గాలించగా నీటికుంటలో శవాలై కనిపించడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. మాస్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. కేసు నమోదు చేసుకున్నారు.

తండ్రి శ్రీనివాస్‌

పిల్లలు చేతన్‌

మృత్యు కొలను మింగేసింది

తండ్రీ, ఇద్దరు పిల్లల మృతి

Advertisement
 
Advertisement
Advertisement