ప్రైవేటు బస్సు చార్జీల మోత | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు చార్జీల మోత

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

శివాజీనగర: ఇంధన తదితర సామగ్రిల ధరల పెరుగుదలతో ఇప్పటికే కంగారు పడుతున్న సామాన్య ప్రజలకు ప్రైవేట్‌ బస్సు యజమానులు మరో షాక్‌ ఇచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి నుంచే ప్రైవేట్‌ బస్సు టికెట్ల ధరలు 20–30 శాతం మేర పెంచాలని తీర్మానించారు. ధరల పెరుగుదలతో ఇప్పటికే ఆర్థిక భారంతో ఉన్న ప్రజలకులిక మరింత భారం కానుంది.

ప్రైవేట్‌ బస్సు యజమానుల వైఖరేంటి?

ఓ బస్సుకు ప్రతి రోజు కనీసం 150 లీటర్ల డీజిల్‌ వేస్తాం. ఇంధనం ధరలో రూ.3 అధికమైన కారణంగా రూ.450 తమకు అదనంగా భారం కానుంది. అందువల్ల టికెట్ల ధర పెంచటం తమకు అనివార్యమైంది. దీంతో ప్రయాణికులపై భారం మోపక తప్పదని కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్‌ బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు నటరాజ్‌ శర్మ తెలిపారు.

ఉదయాన్నే వాత

శుక్రవారం ఉదయాన్నే చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధర పెరుగుదలను ప్రకటించాయి. పెట్రోల్‌, డీజిల్‌ రెండూ లీటర్‌కు రూ.3 అదనంగా పెంచారు. అదే ప్రకారం బెంగళూరులో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.3.27, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.3.12 పెరిగింది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరను కూడా ప్రతి కేజీకి రూ.2 చొప్పున పెంచనున్నట్లు ప్రకటించారు. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధంతో ఇంధనం సరఫరాలో తారతమ్యం నెలకొన్న పరిణామమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిసింది.

ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరొక షాక్‌

శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రైవేట్‌

బస్సు టికెట్ల ధర కూడా పెంపు

20–30 శాతం మేర ధరలు

పెరుగుతాయన్న బస్సు యజమానులు

Advertisement
 
Advertisement
Advertisement