కార్మిక చట్టాల అమలుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాల అమలుపై నిరసన

May 14 2026 12:43 AM | Updated on May 14 2026 12:43 AM

హొసపేటె: కార్మిక, రాజ్యాంగ వ్యతిరేకమైన 4 కార్మిక చట్టాలను అమలు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ హాస్టల్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల విజయనగర జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు నగరంలోని ఏకలవ్య సర్కిల్‌ సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నోటిఫికేషన్ల ప్రతులను దహనం చేశారు. గత కొన్నేళ్లుగా తాము కనీస వేతనం, మెరుగైన జీవన వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఔట్‌ సోర్స్‌, తాత్కాలిక ఔట్‌సోర్స్‌ కార్మికుల పోరాటానికి అన్యాయం చేయడమే ఈ కార్మిక చట్టాల అమలు ఉద్దేశ్యం అని నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు జంబయ్య నాయక్‌, జిల్లా నాయకులు సూర్యనారాయణ, కరిబసవయ్య, దివాకర్‌, దురుగేష్‌, లక్ష్మీదేవి, శారద, శివప్ప, కే.బసవరాజ్‌, మంజుల, కాళమ్మ, ప్రేమావతి, బి.గీత, పంపాపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement