ఉప సమన్వయాధికారిగా సుఖ్‌దేవ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉప సమన్వయాధికారిగా సుఖ్‌దేవ్‌

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉప సమన్వయాధికారిగా సుఖ్‌దేవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రాయచూరు డయట్‌ సీనియర్‌ అధ్యాపకుడిగా, దేవదుర్గ తాలూకా విద్యా శాఖాధికారిగా పని చేసిన సుఖ్‌దేవ్‌ గురువారం నూతన అధికార బాధ్యతలు చేపట్టారు.

అజ్ఞాన అంధకారాన్ని వీడాలి

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు అజ్ఞానమనే అంధకారం నుంచి బయటికి రావాలని విశాఖపట్నం వేదాంత సంస్థ సంచాలకుడు సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో జరిగిన గురుశిష్యుల పరంపర, విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు గురువులను ప్రశ్నించే హక్కు, సేవా మనోభావాలను పెంపొందించుకోవాలన్నారు. నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ దొడ్డయ్య, రాజేష్‌, రశ్మి అద్రి, ప్రవీణ్‌ కుమార్‌, కాంచనలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement