మొక్కల పెంపకంతో పచ్చదనం వృద్ధి | - | Sakshi
Sakshi News home page

మొక్కల పెంపకంతో పచ్చదనం వృద్ధి

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

రాయచూరు రూరల్‌: నగరంలో పచ్చదనం పెంపొందించి పరిసరాలను సంరక్షించాలని గ్రీన్‌ రాయచూరు సంచాలకురాలు సరస్వతి పేర్కొన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌ గురూజీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా గురువారం ఆమె నూతన జిల్లాధికారి కార్యాలయం ఆవరణ వద్ద ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో వేడి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఇంటి ముందు మొక్కలు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో రమేష్‌ జైన్‌, అన్నపూర్ణ, సంగీత, గురురాజ్‌, మల్లికార్జున, చంద్రశేఖర్‌, విశాల్‌, పూర్విత, సంపూర్ణలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement