రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించాలని ఏఐసీఐటీయూ రాష్ట సంచాలకులు అజీజ్ డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ వ్యతిరేక కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు అన్ని విధాలుగా నష్టపోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. నరేగలో తొలగించి వికసిత భారత్ మిషన్ రోజ్‌గార్ పేరును నమోదు చేయడం తగదన్నారు. నరేగ పథకం రద్దుతో నేడు వలసలు వెళుతున్న కూలీలు, కార్మికుల భవిష్యత్ అంధకారమైందన్నారు. ఆందోళనలో లక్ష్మణ్, ఈరణ్ణ, వీరన గౌడ, భీమణ్ణ, జగదీష్, ఆంజనేయ, తిమ్మప్పలున్నారు.


