రాయచూరు రూరల్: నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్న రంగ మందిరంలో ఆదివారం జిల్లా దళిత, జెడ్పీ, నగర సభ, కన్నడ సంస్కృతి, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ మాట్లాడుతూ.. హేమారెడ్డి మల్లమ్మ శరణుల చింతనలను అలవర్చుకున్న విషయాలను ప్రప్తావించారు. అలనాటి మహా మానవతా వాది బసవన్న సమకాలికురాలు అయిన హేమరెడ్డి మల్లమ్మ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. హేమరెడ్డి మల్లమ్మ జీవత చరిత్రను భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి సుధాకర్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్య, వీర సంగన బసవ స్వామీజీ, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, శరణప్ప, ఉమేష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, బసన గౌడ, రామన గౌడ కేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్లమ్మ జీవితం ఆదర్శం
సాక్షి, బళ్లారి: మహాసాథ్వి మల్లమ్మ జీవితం మానవాళికి ఆదర్శం అని కర్ణాటక రాష్ట్ర రెడ్డి జన సంఘం డైరెక్టర్ గణపాల ఐనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని వేమనపీఠం ఆధ్వర్యంలో హేమరెడ్డి మల్లమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లమ్మ విగ్రహానికి పూజలు చేసి, నివాళులర్పించారు. గణపాల ఐనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లమ్మ రెడ్డి సమాజంలో జన్మించడంతో మన అందరికి గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సమాజ ప్రముఖులు బసవరాజ్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని బసవ భవనంలో వీరశైవ లింగాయ్ రెడ్డి సమాజంలో హేమరెడ్డి మల్లమ్మకు ఘనంగా నివాళులర్పించారు.
హేమరెడ్డి మల్లమ్మ విగ్రహానికి పూజలు చేస్తున్న రెడ్డి సమాజ ప్రముఖులు బసవ భవనంలో వీరశైవ లింగాయత్ రెడ్డి సమాజం ఆధ్వర్యంలో మల్లమ్మ జయంతి


