సాధువు వేషంలో వచ్చి టోకరా | - | Sakshi
Sakshi News home page

సాధువు వేషంలో వచ్చి టోకరా

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

రాయచూరు రూరల్‌: సాధువులు, సంతుల వేషంలో వచ్చి బంగారు, నగదును మా యం చేసిన ఉదంతం రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వారం రోజుల క్రితం సింధనూరులో జరిగింది. సింధనూరు– కుష్టిగి రహదారిలో మందుల దుకాణాన్ని నడుపుకుంటున్న టింకు, భర్త విష్ణుదత్తలకు సాధువు వచ్చి బూడిద అంటించి వారి వద్ద నుంచి బంగారు, డబ్బులు తీసుకొని పరారయ్యాడు. తాగునీటి కోసం వచ్చిన సాధువు ఆ నీటిని ఎందుకు తాగుతారు అని ఫ్రిజ్‌లో నుంచి చల్లని నీరు తీసి ఇచ్చారు. సాధువు వెంటనే దుకాణం ముందుకొచ్చి వారికి పువ్వులు ఇచ్చాడు, వారిద్దరూ పూల వాసన చూసి మూర్ఛపోయారు. అంతలో అరతులం బంగారు, రూ.10 వేల నగదును తీసుకొని పరారయ్యాడు. ఈ విషయంపై టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు.

బంగారు, నగదు

అపహరించుకుని పరారీ

సింధనూరులో వ్యాపారిని

మోసగించిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement