19 రాత్రి నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె పిలుపు | - | Sakshi
Sakshi News home page

19 రాత్రి నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె పిలుపు

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

బనశంకరి: కేఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు మరింత వేతన పెంపు డిమాండుతో ఈ నెల 19వ తేదీ రాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. 19వ తేదీన తుమకూరులో రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ల పాలన సాధనా సమావేశంలో నల్లదుస్తులు ధరించి నిరసన తెలుపుతామని తెలిపారు. ఉద్యోగుల డిమాండు మేరకు గత ఏడాది మార్చి నుంచి వర్తించేలా 12.5 శాతం వేతనాలను సర్కారు పెంచింది. కానీ 25 శాతం కావాలని, అది కూడా 2024 జనవరి నుంచి వర్తించాలని ఉద్యోగ సంఘాలు భీష్మించాయి. 19 తేదీ రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్‌లు నిలిపేస్తామని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement