అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీ

May 14 2026 12:43 AM | Updated on May 14 2026 12:43 AM

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్‌ మహమ్మద్‌ అక్రమ్‌ అలీ బుధవారం తాలూకాలోని శివపుర గొల్లరహట్టి, బీబీ తండా, కానాహొసహళ్లిలలో వివిధ పనులను తనిఖీ చేశారు. ఆయన తాలూకాలోని శివపుర గొల్లరహట్టిలో తాగునీటి సరఫరా పనులను, ఆ తర్వాత బండె బసాపుర తాండాలోని పాఠశాల గదుల పనులను తనిఖీ చేశారు. కర్ణాటక మైనింగ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రిస్టోరేషన్‌ కార్పొరేషన్‌ గ్రాంటుతో చేపడుతున్న పట్టణ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ మరమ్మతులను ఆయన పరిశీలించారు. పనుల అనంతరం జెడ్పీ కానాహొసహళ్లిలోని వెనుకబడిన తరగతుల ప్రీ–మెట్రిక్‌ బాలుర హాస్టల్‌ను సందర్శించారు. సీఈఓ కేఎంఈఆర్‌సీలో అదనపు గదుల నిర్మాణ స్థలాన్ని, పోస్ట్‌–మెట్రిక్‌ బాలికల హాస్టల్‌ భవన నిర్మాణ పనులను, కేఎంఈఆర్‌సీ పరిధిలోని బీసీఎం ప్రీ–మెట్రిక్‌ బాలికల హాస్టల్‌ నిర్మాణ స్థలాన్ని కూడా తనిఖీ చేశారు.

కర్ణాటక గనుల పర్యావరణ పునరుద్ధరణ

కార్పొరేషన్‌ గ్రాంటు కింద నివాస గృహాల నిర్మాణం, మరమ్మతులతో సహా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను సీఈఓ అక్రమ్‌ అలీ షా పరిశీలించారు. ఈ విషయమై సమగ్ర సమీక్ష నిర్వహించి తాలూకాలో అద్దె భవనాల్లో ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. టీపీ ఈఓ నరసప్ప, జెడ్పీ ఇంజినీరింగ్‌ సబ్‌–డివిజన్‌ ఏఈఈ మల్లికార్జున, తాగునీటి సరఫరా శాఖ ఏఈఈ ప్రసన్న, గ్రామ పీడీఓ వినయ్‌కుమార్‌, బీసీఎం హాస్టల్‌ వార్డెన్లు ఎస్‌వీ.రాచప్ప, సహనా వీరేంద్ర, ఫస్ట్‌ క్లాస్‌ అసిస్టెంట్‌ మారుతి, టీఏపీ సిబ్బంది రాఘవేంద్ర, మాజీ గ్రామ సభ్యుడు నాగరాజ్‌, గ్రామ బిల్‌ కలెక్టర్‌ టీఎస్‌.సుకుమార్‌, నీరుగంటి తిప్పేస్వామి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement