నా భర్త సరైనోడు కాదు..! | Bengaluru Influencer Blackmail Case Takes Dramatic Turn As Wife Accuses Husband Of Exploiting Sadhana Shetty In Love Trap Row | Sakshi
Sakshi News home page

నా భర్త సరైనోడు కాదు..!

May 14 2026 10:43 AM | Updated on May 14 2026 10:52 AM

Sadhana Shetty Blackmail Case

బనశంకరి: బెంగళూరులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాధనాశెట్టి.. బ్లాక్‌మెయిల్‌  కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో సాధనాశెట్టిని కార్తీక్‌పుతా లైంగికంగా వేధించాడని అతని భార్య హర్షిత జయనగర పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. అసలు దోషి తన భర్తే అని.. అక్రమ సంబంధాలు దాచి పెట్టేందుకు సాధనాశెట్టిపై ఫిర్యాదు చేశాడని ఆరోపించింది. వివరాలు.. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాధనాశెట్టిని వ్యాపార ప్రచారం కోసం మేకప్‌ క్లినిక్‌ యజమాని కార్తీక్‌పుతా కలిశాడు.

తొలుత వీరి మధ్య ప్రారంభమైన స్నేహం.. ప్రేమకు దారి తీసింది. అనేకచోట్ల ఇద్దరూ తిరిగారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లైంగికంగా వాడుకున్నాడంటూ సాధనాశెట్టి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో   కార్తీక్‌పుతా.. సాధనాశెట్టి మొబైల్‌ చోరీకి పాల్పడ్డాడు. అంతేకాక లైంగిక సంబంధం దాచిపెట్టడానికి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పెట్టుకుని హనీట్రాప్‌కు పాల్పడుతోందని  ఆరోపిస్తూ జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

తాజాగా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సాధనాశెట్టిపై కార్తీక్‌పుతా ఫిర్యాదు చేశాడని భార్య హర్షిత చెబుతోంది. కార్తీక్‌పుతా బిజినెస్‌మెన్‌ కాదు. కాస్మోటిక్‌ మార్కెటింగ్‌ చేసేవాడు. యువతి ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవని హనీట్రాప్‌ అంటూ ముందే  పోలీసులకు ఫిర్యాదు చేశాడని భార్య చెబుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement