ఈజీపుర ఫ్లై ఓవర్‌ పనులకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ఈజీపుర ఫ్లై ఓవర్‌ పనులకు మోక్షం

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

బనశంకరి: బెంగళూరు దక్షిణ పాలికె పరిధిలో కొన్నేళ్లుగా సాగుతున్న ఈజీపుర కేంద్రీయ సదన ఫ్లై ఓవర్‌ పనులు వేగవంతమయ్యాయి. ఈ వంతెన పొడవు 2.38 కిలోమీటర్లు కాగా, ఎన్నో ఏళ్లుగా నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సెయింట్‌జాన్స్‌ ఆస్పత్రి వద్ద సంక్లిష్టమైన పోర్టల్‌ ఫ్రేమ్‌ పనులు నిలబడి పోగా, ఫిబ్రవరిలో వాటిని పరిష్కరించారు. ఇక్కడ భూస్వాధీనం పెండింగ్‌లో ఉండింది. ర్యాంప్స్‌ చివరి పనులను పూర్తిచేసి ఈ ఏడాదిలోగా ప్రజల సంచారానికి పచ్చజెండా ఊపే చాన్సుంది.

కాంట్రాక్టర్లు మారుతూ..

2017 మే 4వ తేదీన రూ.203 కోట్ల వ్యయంతో ఈజీపుర పై వంతెన పనులకు నాంది పలికారు. కానీ కాంట్రాక్టు సంస్థ అలసత్వం, వివిధ సమస్యల వల్ల పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా జరగడంతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో 2022 మార్చిలో మరో సంస్థకు నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. అక్టోబరులోగా పూర్తిచేసి సంచారానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఈజీపుర పథకం చీఫ్‌ ఇంజనీర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

అక్టోబరులో ప్రారంభానికి సన్నాహాలు

Advertisement
 
Advertisement
Advertisement