రాయచూరు రూరల్: భారతదేశంలో హిందు వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధిచడం మనందరి కర్తవ్యం అని కిల్లే బ్రహన్మ మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. శుక్రవారం ఈశ్వర దేవాలయలంలో రాయచూరు జిల్లా వీరశైవ జంగమ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో వేద అధ్యయనం, సంస్కార శిబిరాల ముగింపు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. పిల్లలకు సనాతన సంప్రదాయాలు ఆచార, వ్యవహారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి ఆిసక్తి కల్పించేలా చూడాలని సూచించారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన జంగమ సమాజం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో శరణ భూపాల్ నాడగౌడ, మాలి పాటిల్, చంద్రశేఖర్, బసవరాజ్, శరణయ్య స్వామి, పంపాపతి శాస్త్రి, రామన గౌడ తదితరులు పాల్గొన్నారు.


