నైతిక విలువలు అలవర్చుకోండి | - | Sakshi
Sakshi News home page

నైతిక విలువలు అలవర్చుకోండి

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

కోలారు: విద్యార్థులు విద్యతో పాటు తమ జీవితంలో నైతిక విలువలు అలవర్చుకోవాలని డీఐజీ డి.దేవరాజ్‌ పిలుపునిచ్చారు. సోమవారం బంగారుపేట పట్టణంలోని ఎస్‌డీసీ విద్యా సంస్థలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ద్వితీయ ఇంటర్‌లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయిన 465 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పట్టాతో ఉన్నత ఉద్యోగం సాధించవచ్చన్నారు. అయితే దానితో పాటు విద్యార్థులు ఉత్తమ విలువలు అలవర్చుకోవాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్‌ శాఖ విద్యా సంస్థల వ్యాప్తిలో మాదక ద్రవ్యాల విక్రయించడాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. సమాజాన్ని మాదక ద్రవ్య రహితంగా చేయడానికి అందరు చేతులు జోడించాలన్నారుు. బంగారు పేట కన్నడ సంఘం అధ్యక్షుడు పల్లవి మణి, ఎస్‌డీసీ సమూహ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement