రాయచూరు రూరల్: మద్యం తాగొద్దని బుద్ధి మాటలు చెప్పిన అన్నను.. తమ్ముడు హతమార్చాడు. ఈ ఘటన శనివారం రాత్రి రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసూగురులోని బసవ సాగర్ క్రాస్ వద్ద అన్నాతమ్ముళ్లు బసవరాజ్ వాసుదేవ్, శ్రీధర్ నివసిస్తున్నారు. శ్రీధర్ రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చేవాడు. ఇంట్లో తల్లిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వేధించసాగాడు. మద్యం తాగడం మంచిది కాదు.. మద్యం మానేయాలని శ్రీధర్‌కు అన్న బసవరాజ్ వాసుదేవ్ సూచించాడు. అప్పటి నుంచి కోపం పెంచుకున్న శ్రీధర్.. శనివారం రాత్రి బసవరాజ్ వాసుదేవ్ నిద్రించినప్పుడు గొంతు నులిమి హత్య చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌ను అదపులోకి తీసుకున్నట్లు ఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హుసికేరప్ప వివరించారు.


